Andhra Pradesh: త్వరలో ఏపీలో మోగనున్న సమ్మె సైరన్.. ప్రభుత్వానికి జూనియర్‌ డాక్టర్ల నోటీసు

తమ న్యాయమైన కోర్కెను తీర్చడానికి ప్రభుత్వం ముందుకు రానట్లు అయితే సమ్మెకు దిగాలని నిర్ణయించారు. ఈ నెల 25 వరకు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టనున్నారు. 26న ఓపీ సేవలు బహిష్కరించనున్నట్లు తెలిపారు.

Andhra Pradesh: త్వరలో ఏపీలో మోగనున్న సమ్మె సైరన్.. ప్రభుత్వానికి జూనియర్‌ డాక్టర్ల నోటీసు
Andhra Pradesh Jr. Doctors
Follow us

|

Updated on: Oct 21, 2022 | 10:02 AM

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో వైద్య విభాగం సమ్మె సైరన్ మోగనుంది. ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్స్ సమ్మె నోటీసులను ఇచ్చారు. తమ స్టైఫండ్‌ 42 శాతం పెంచాలని గత కొంతకాలంగా ప్రభుత్వాన్ని జూనియర్ డాక్టర్లు  కోరుతున్నారు. అయితే తాము కోరిన కోర్కె పట్ల ప్రభుత్వం స్పందించకపోవడంతో.. జూనియర్‌ డాక్టర్లు సమ్మెకు దిగనున్నారు. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వానికి సమ్మె నోటీసు అందించారు. నిరసనలో భాగంగా తొలిరోజు ముఖ్యమంత్రి జగన్‌కు పూలతో కూడిన లేఖలు రాశారు.

ఈ నెల 26 నుంచి ఓపీ సేవలను నిలిపివేయనున్నామని జూనియర్ వైద్యులు ప్రకటించారు. అప్పటికీ తమ న్యాయమైన కోర్కెను తీర్చడానికి ప్రభుత్వం ముందుకు రానట్లు అయితే సమ్మెకు దిగాలని నిర్ణయించారు. ఈ నెల 25 వరకు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టనున్నారు. 26న ఓపీ సేవలు బహిష్కరించనున్నట్లు తెలిపారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే 27 నుంచి వార్డులు, నాన్‌ ఎమర్జెన్సీ సేవలు బహిష్కరిస్తామని ప్రకటించారు. ఈ నెల 27 నుంచి అత్యవసర మినహా మిగిలిన సేవలను కొనసాగించమని వారు పేర్కొన్నారు.  11 ప్రభుత్వ వైద్య కళాశాలల జూడాలు ఈ సమ్మెలో పాల్గొననున్నారు.

ఇతర రాష్ట్రాల్లో హౌస్‌ సర్జన్లకు రూ.30,000, బ్రాడ్‌ స్పెషాలిటీ..  పీజీలకు రూ.65 వేలు స్టైఫండ్‌ ఇస్తున్నారని, సూపర్‌ స్పెషాలిటీ పీజీలకు రూ.80,000 వేతనం ఇస్తున్నారని తమకు మాత్రం హౌస్‌ సర్జన్లకు రూ.19,589, బ్రాడ్‌ స్పెషాలిటీ పీజీలకు రూ.44,075 వేలు, సూపర్‌ స్పెషాలిటీ పీజీలకు రూ.53,869 వేతనం మాత్రమే ఇస్తున్నారని జూనియర్ వైద్యులు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఇదే విషయంపై ఇన్‌చార్జి డీఎంఈ డాక్టర్‌ వినోద్‌కుమార్‌  స్పందిస్తూ.. రాష్ట్రంలో జూనియర్‌ వైద్యులు సమ్మె నోటీసులు ఇవ్వడం నిజమేనని చెప్పారు. అంతేకాదు.. ఇప్పటికే ఇదే విషయంపై ప్రభుతం, ఆర్ధిక శాఖ నిర్ణయం తీసుకున్నదని పేర్కొన్నారు.  త్వరలో జూనియర్స్ డాక్టర్లకు స్టైఫండ్ పెంచనున్నామని తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో