Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. తిరుమలలో కొనసాగుతున్న రద్దీ .. అంగప్రదక్షిణ టోకెన్ల నంవంబర్ నెల కోటా విడుదల
శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. స్వామివారి దర్శనం కోసం 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది.
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం. నంవంబర్ నెల కోటా అంగప్రదక్షిణ టోకెన్లను టీటీడీ విడుదల చేయనుంది. నేడు ఉదయం 10 గంటలకు టీటీడీ వెబ్ సైట్ లో టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ. డిసెంబర్ నెల ఆర్జిత సేవా టికెట్లు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది. ఈరోజు ఉదయం 10 గంటల నుండి 24న ఉదయం 10 గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ నమోదు చేసుకునే అవకాశం ఉంది.
శ్రీవారిని దర్శించుకున్న భక్తులు:
శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. స్వామివారి దర్శనం కోసం 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. గురువారం శ్రీవారి హుండీ ఆదాయం 5.85 కోట్ల రూపాయలని అధికారులు చెప్పారు. అంతేకాదు నిన్న ఒక్కరోజే శ్రీవారిని 62,725 మంది భక్తులు దర్శించుకున్నారు. కోనేటి రాయుడికి తలనీలాలను 30,172 మంది భక్తులు సమార్పించారు.
నిర్మలా సీతారామన్:
తిరుమల మూడురోజుల పర్యటనలో భాగంగా మూడో రోజు కేంద్ర ఆర్థికశాఖామంత్రి నిర్మలా సీతారామన్ శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఉదయం అభిషేక సేవలో శ్రీవారిని దర్శించుకున్నారు. నిర్మలా సీతారామన్ కు ఘన స్వాగతం పలికిన అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితుల వేదాశీర్వచనం అందజేశారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..