AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali: ఆస్తమా బాధితులు దీపావళిని హ్యాపీగా చేసుకోవాలనుకుంటున్నారా.. ఈ చిట్కాలను పాటించండి

ముఖ్యంగా ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారు దీపావళి రోజున మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత ఎక్కువ సమయం ఇంటి లోపల గడపడం మంచిది. ఉబ్బసం వల్ల ఛాతీ నొప్పి, ఊపిరి పీల్చుకోవడం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది.

Diwali: ఆస్తమా బాధితులు దీపావళిని హ్యాపీగా చేసుకోవాలనుకుంటున్నారా.. ఈ చిట్కాలను పాటించండి
Diwali 2022
Surya Kala
|

Updated on: Oct 21, 2022 | 8:05 AM

Share

దీపావళి పర్వదినం అంటే.. వయసుతో సంబంధం లేకుండా ఇష్టపడతారు. ఉత్సాహభరితమైన సాంప్రదాయ దుస్తులు ధరిస్తారు.  దీపాలను వెలిగిస్తారు. సాంప్రదాయ రీతిలో పండగను ఉత్సాహంగా జరుపుకుంటారు. పిల్లలు, పెద్దలు పటాకులు కలుస్తారు. అయితే దీపావళికి బాణాసంచా వెలిగించే సమయంలో బ్రోన్కైటిస్, ఆస్తమా, ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్, అలెర్జీ రినిటిస్ వంటి శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బంది పడేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బాణాసంచా కాల్చే సమయంలో వాతావరణంలో కాలుష్యం కూడా ఏర్పడుతుంది. దీంతో కొంతమంది ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు. కనుక కాలుష్య కారకాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారు దీపావళి రోజున మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత ఎక్కువ సమయం ఇంటి లోపల గడపడం మంచిది. ఉబ్బసం వల్ల ఛాతీ నొప్పి, ఊపిరి పీల్చుకోవడం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. ఈ దీపావళికి ఆస్త్మా బాధితులు ఉపశమనం కోసం తీసుకోవలసిన కొన్నినియమాలు తెలుసుకుందాం.

దీపావళి సమయంలో ఆస్తమా బాధితులు నివారణ చిట్కాలు.

సమతుల్య భోజనం తినండి.. తక్కువ తినండి. ఎందుకంటే దీపావళి సమయంలో రుచికరమైన విందు భోజనం, స్వీట్స్ వంటి అనేక రకాల పదార్ధాలు ఉంటాయి. కనుక కొంచెం ఎక్కువ తినడం సర్వసాధారణం. అయితే ఆస్తమా వ్యాధిగ్రస్తులు అతిగా తినడం, కొవ్వు పదార్ధాలు తీసుకోవడం చాలా ప్రమాదకరం.

ఇవి కూడా చదవండి

ఇన్‌హేలర్‌: మీ ఇన్‌హేలర్‌ను ఎల్లవేళలా దగ్గరగా ఉంచుకోండి. ఎందుకంటే ఇది ఆస్తమా బాధితులకు మంచి మెడిసిన్మం. అస్తమాను నియంత్రించడంలో మీకు సహాయపడుతుంది.

N95 మాస్క్: దీపావళి సమయంలో బయటికి వెళితే, N95 మాస్క్‌ని ఉపయోగించండి. దీంతో బాణాసంచా వలన కలిగే వాయు కాలుష్యం, పొగ ముక్కులోకి వెళ్లకుండా ఆపవచ్చు.

హైడ్రేటెడ్: శరీరంలో తగినంత నీటి శాతం ఉండేలా చూసుకోవాలి. రోజంతా గోరువెచ్చని నీటిని తాగడం ద్వారా శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. వివిధ రకాల చికాకులతో సహా టాక్సిన్స్ శరీరం నుండి తొలగించబడతాయి.

దుమ్ము నుంచి రక్షణ కోసం: ఇప్పటికే శ్వాస సమస్యలు లేదా ఆస్తమా వంటి శ్వాసకోశ రుగ్మతలు ఉన్నవారు వీలైనంత వరకు ఇంటిలోపల ఉండడానికి ప్రయత్నించండి. దుమ్ము, ధూళి, పొగకు దూరంగా ఉండండి.

ఆల్కహాల్: ఆల్కహాల్ ఆస్తమా బాధితులకు మరింత హాని చేస్తుంది. శ్వాసకోస ఇబ్బందులను మరింత తీవ్రతరం చేస్తుంది. కనుక  దీపావళి సమయంలో ఆల్కహాల్ కు దూరంగా ఉండండి. ముఖ్యంగా ఆస్తమా బాధితులకు ఆకస్మిక ప్రమాదాన్ని పెంచుతుంది.

ఈ చిట్కాలను దృష్టిలో ఉంచుకోండి. ఆస్తమా బాధితులు కూడా దీపావళి పర్వదినాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి..

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ( ఇందులోని అంశాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. పాటించే ముందు ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)