Horoscope Today: శుక్రవారం రాశి ఫలితాలు.. నేడు ఈ రాశివారు ఆర్ధికంగా శుభ ఫలితాలను అందుకుంటారు..

వెంటనే తమ దినఫలాల వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (అక్టోబర్ 21 వ తేదీ ) శుక్రవారం  రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Horoscope Today: శుక్రవారం రాశి ఫలితాలు.. నేడు ఈ రాశివారు ఆర్ధికంగా శుభ ఫలితాలను అందుకుంటారు..
Horoscope Today
Follow us
Surya Kala

|

Updated on: Oct 21, 2022 | 6:34 AM

Horoscope Today (21-10-2022):  రోజు మొదలైతే మనిషి ముందుగా ఆలోచించేది.. ఈరోజు తమకు ఎలా ఉంటుంది.. మంచి, చెడుల గురించి ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (అక్టోబర్ 21 వ తేదీ ) శుక్రవారం  రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేష రాశి: ఈ  రోజు ఈ రాశివారికి మానసిక శాంతి లభించే విధంగా జాగ్రత్త తీసుకోవాలి. మానసిక సౌఖ్యం లభిస్తుంది. అనవసర విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు విబేధాలు లేకుండా పనితీరుతో ప్రశంసలను అందుకుంటారు. శారీరకంగా అధికంగా శ్రమ పడాల్సి ఉంటుంది. శ్రద్ధగా పనిచేసి శుభ ఫలితాలను సొంతం చేసుకుంటారు.

ఇవి కూడా చదవండి

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు నూతన వస్తువు, బట్టలను కొనుగోలు చేస్తారు. ప్రారంభించిన పనులను పూర్తి చేస్తారు. శుభవార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. అవసరాలకు ధనం చేకూరుతుంది.

కర్కాటక రాశి: ఈరోజు ఈ రాశివారు చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురైనా ఇతరుల సహకారంతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. కీలక వ్యవహారంలో దైర్యంగా ముందుకు అడుగు వేయాల్సి ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆశించే ఫలితాలను అందుకుంటారు.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు శుభకాలం. బంధు, మిత్రులతో కలిసి విందు వినోదకార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన పనిని  సులభంగా పూర్తి చేశారు. ప్రతిభకు తగిన ప్రశంసలను అందుకుంటారు.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు ఖర్చులు పెరగడకుండా చూసుకోవాలి. మంచి పనులు చేపడతారు. అనవసర ఆందోళనకు దూరంగా ఉండడం మేలు. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు అవసరానికి డబ్బులు అందుకుంటారు. శుభ కార్యాల్లో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో ఇతరుల  సాయం అందుకుంటారు. అంతటా విజయం ఉంది.

వృశ్చిక రాశి: ఈరోజు ఈ రాశివారు కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వడం మేలు చేస్తుంది. చేపట్టిన పనుల్లో కీలక నిర్ణయాలను తీసుకుని ముందుకు వెళ్తారు. మానసికంగా శాంతి కలుగుతుంది.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశి వారు వృత్తి, విద్య, ఉద్యోగాల్లో ఆర్థికాభివృద్ధిని అందుకుంటారు. శుభవార్త వింటారు. శుభకాలం. ప్రారంభించిన పనులను సులభంగా పూర్తి చేస్తారు. అధిక ఒత్తిడిని దరిచేరనీయకండి.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు బంధు, మిత్రుల సహకారంతో ఆయా రంగాల్లో అనుకూల ఫలితాలను అందుకుంటారు. చేపట్టే పనుల్లో బద్ధకాన్ని వీడాలి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తారు.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు శుభవార్త వింటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లోని వారు అభివృద్ధికి సంబంధించి ఇతరుల సహకారంతో ముందుకు వెళ్లారు. అవసరానికి ఆర్థిక సహకారం అందుకుంటారు. సమయ పాలనతో పనులను పూర్తిచేస్తారు.

మీన రాశి: ఈరోజు ఈ రాశివారు ప్రతిభతో పనితీరుకు తగిన ప్రశంసలను అందుకుంటారు. భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలను తీసుకుంటారు. ప్రారంభించిన పనుల్లో శుభఫలితాలను అందుకుంటారు. ముఖ్యమైన పనుల విషయంలో ఆర్ధిక పురోగతి ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!