Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips to Diwali: దీపావళి పండగ తేదీ, శుభ ముహూర్తం.. లక్ష్మీ దేవిని ప్రసన్నం కోసం పాటించాల్సిన వాస్తు చిట్కాలు.. మీకోసం

దీపావళి పండగలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇంటిని శుభ్రపదాచుకుంటారు. అందంగా అలంకరిస్తారు. పరిశుభ్రమైన ఇల్లు లక్ష్మి దేవి అనుగ్రహం సొంతం చేసుకుంటుందని నమ్మకం. 

Vastu Tips to Diwali: దీపావళి పండగ తేదీ, శుభ ముహూర్తం..  లక్ష్మీ దేవిని ప్రసన్నం కోసం పాటించాల్సిన వాస్తు చిట్కాలు.. మీకోసం
Diwali 2022
Follow us
Surya Kala

|

Updated on: Oct 18, 2022 | 12:09 PM

హిందువులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే పండుగల్లో ఒకటి దీపావళి పండగ. దీపావళి ఉత్సవాలను దీపాలు వెలిగీస్తారు. కొత్త బట్టలు ధరించడం, కుటుంబ సభ్యులు, స్నేహితులను కలవడం చేస్తారు. అంతేకాదు దీపావళి రోజున సంపద శ్రేయస్సు, ఆనందం ,  ఆరోగ్యాన్ని ఇచ్చే లక్ష్మీ దేవిని పూజిస్తారు. ఈ  ఏడాది దీపావళి పండగను అక్టోబరు 24న జరుపుకోనున్నారు. ఈ దీపావళి పండగలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇంటిని శుభ్రపదాచుకుంటారు. అందంగా అలంకరిస్తారు. పరిశుభ్రమైన ఇల్లు లక్ష్మి దేవి అనుగ్రహం సొంతం చేసుకుంటుందని నమ్మకం.  ఈ ఏడాది దీపావళి పర్వదినం జరుపుకునే తేదీ, ముహూర్తం వాస్తు చిట్కాలను గురించి తెలుసుకుందాం..

లక్ష్మీ పూజకు తేదీ, సమయం, ముహూర్తం

తేదీ: అక్టోబర్ 24, 2022

ఇవి కూడా చదవండి

రోజు: సోమవారం

సాయంత్రం 5.39 గంటలకు లక్ష్మీపూజ ప్రారంభం

సాయంత్రం 6.51 గంటలకు లక్ష్మీపూజ ముగింపు

1) ఇంటిని శుభ్రపరచడం: దీపావళికి శుభ్రం చేసుకోవడం ముఖ్యం. ఇల్లు, ఆఫీసు లేదా మీరు తరచుగా వెళ్లే  ఏదైనా ఇతర ప్రదేశంలో సానుకూల శక్తి ప్రవహించేలా చేయడానికి అత్యంత ముఖ్యమైన కార్యకలాపం. ప్రతికూల శక్తిని తొలగించడానికి మీ ఇంటి ప్రతి మూలను శుభ్రం చేయడం చాలా ముఖ్యం. మీ వంటగది, స్టోర్ రూమ్ ని తగిన విధంగా శుభ్రం చేయాలి.

2) విరిగిన వస్తువులను వదిలించుకోండి: వాస్తు ప్రకారం.. మీరు ఉపయోగించని, అద్దాలు, ఎలక్ట్రానిక్స్, గాడ్జెట్లు, బొమ్మలు, టపాకాయలు లేదా ఉపయోగంలో లేని అన్ని విరిగిన వస్తువులను వదిలించుకోవాలని పెద్దలు చెబుతారు. మీ ఇంటి నుండి ఉపయోగించని, విరిగిన వస్తువులన్నింటినీ వెంటనే తొలగించండి.

3) ఇంటి ఉత్తర విభాగానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వండి: మీ ఇంటిలోని ఈ  ఉత్తరం కుబేర స్థానం. మీ ఇంటికి ఉత్తర, ఈశాన్య దిశలను చక్కగా, శుభ్రంగా, అద్భుతంగా, ఆకర్షణీయంగా , అందంగా ఉంచడం చాలా కీలకం. మీ బ్రహ్మస్థానాన్ని శుభ్రంగా ఉంచండి. ఇంటి ఉత్తర దిశలో ఎలాంటి వాస్తు దోషాలు లేవని నిర్ధారించుకోండి. ఈ ప్రాంతంలో ఎలాంటి వాస్తు దోషాలైనా ఉంటే ఆదాయాన్ని కోల్పోతాయి. ఉత్తరాన  నీటి ట్యాంక్, తోట లేదా ప్రధాన ద్వారం కలిగి ఉండవచ్చు. లివింగ్ రూమ్‌లో ఉత్తరం వైపున అక్వేరియం,  టెర్రస్‌పై పక్షులకు నీరు నింపిన గిన్నె ఉండటం కూడా అదృష్టంగా పరిగణించబడుతుంది.

4) ముగ్గులు, అందమైన పూజా మండపాలు: మీ ఇంటిని డయాస్, లైట్లు, పువ్వులు, ముగ్గులు, తేలియాడే కొవ్వొత్తులు, గులాబీ రేకులు,  ఇతర అలంకార వస్తువులతో అలంకరించండి. ఇది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఇస్తుంది. ఇంటి ముందు అందంగా ముగ్గులతో అలంకరించండి. లక్ష్మి దేవికి అందమైన ముగ్గులు సంతోషాన్ని ఇస్తాయి. మండపం పెయింట్ ఉపయోగించరాదు.  ప్రధాన ద్వారం  దగ్గర స్వస్తిక్ తో పాటు ఇరువైలా శుభం, లాభం అని రాయండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)