AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arunachal Pradesh: మూలికల కోసం అడవికి వెళ్లిన యువకులు.. 59 రోజులైనా లభించని ఆచూకీ.. చైనాలో అడుగుపెట్టి ఉంటారని అనుమానం

మన్యు , టిక్రో ఔషధ మూలికల కోసం సరిహద్దు ప్రాంతంలోని ఇంటిని విడిచి అడవులకు వెళ్లారు. అప్పటి నుంచి కనిపించకుండా పోయారు. అక్టోబరు 9న అతని కుటుంబ సభ్యులు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. ఇద్దరు యువకుల కోసం గాలిస్తున్నారు.

Arunachal Pradesh: మూలికల కోసం అడవికి వెళ్లిన యువకులు.. 59 రోజులైనా లభించని ఆచూకీ.. చైనాలో అడుగుపెట్టి ఉంటారని అనుమానం
Arunachal Pradesh
Surya Kala
|

Updated on: Oct 17, 2022 | 7:42 AM

Share

అరుణాచల్ ప్రదేశ్‌లోని ఇండో-చైనా సరిహద్దులో ఇద్దరు భారతీయ యువకులు అదృశ్యమయ్యారు. అంజావ్ జిల్లాలోని దులియాంగ్ గ్రామానికి చెందిన బాటేలుమ్ టిక్రో (33), బేయింగ్‌సో మన్యు (35) ఆగస్టు 19న చగ్లగామ్‌కు ఔషధ మొక్కలను వెతకడానికి బయలుదేరారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంటికి తిరిగి రాలేదు. చైనా సరిహద్దు సమీపంలో అదృశ్యమయ్యారు. దీంతో యువకుల కుటుంబ సభ్యులు అక్టోబర్ 9వ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఔషధ మొక్కలను వెదుకుతూ.. తెలియక చైనా వెళ్లి ఉంటారనే అనుమానంతో ఇరువురి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. తప్పిపోయిన జంటను కనిపెట్టాలని టిక్రో, మన్యు కుటుంబాలు రాష్ట్రానికి, కేంద్రానికి, భారత సైన్యానికి విజ్ఞప్తి చేశాయి. చివరిసారిగా ఆగస్ట్ 24న స్థానికులకు కనిపించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మన్యు , టిక్రో ఔషధ మూలికల కోసం సరిహద్దు ప్రాంతంలోని ఇంటిని విడిచి అడవులకు వెళ్లారు. అప్పటి నుంచి కనిపించకుండా పోయారు. అక్టోబరు 9న అతని కుటుంబ సభ్యులు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. ఇద్దరు యువకుల కోసం గాలిస్తున్నారు.

అదే సమయంలో తాము ఇండియన్ ఆర్మీని సంప్రదించామని.. మరోవైపు తమ ఆపరేషన్ కొనసాగుతోందని అంజావ్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రైక్ కమ్సి తెలిపారు. సరిహద్దు సమీపంలో నివసిస్తున్న సాక్షులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తుల నుంచి పూర్తి సమాచారాన్ని సేకరించి.. ఎంక్వైరీ పూర్తి చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని ఆయన చెప్పారు. అయితే, స్థానిక ప్రజలు ఔషధ మూలికల కోసం అడవులకు వెళ్లడం సర్వసాధారణం.

ఇవి కూడా చదవండి

అదే సమయంలో.. వారిద్దరినీ చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్‌ఎ) అదుపులోకి తీసుకుని ఉండవచ్చని బెటిలం తమ్ముడు దిషాన్సో చిక్రో పేర్కొన్నారు. “తన సోదరుడు అనుకోకుండా LACని దాటడంతో PLA అదుపులోకి తీసుకున్నట్లు మేము అనుమానిస్తున్నాము” అని చిక్రో చెప్పారు. తమ కుటుంబాలు చాలా ఆందోళన చెందుతున్నాయని చెప్పారు.  కుటుంబ సభ్యులు ఖుపా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. హులియాంగ్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే దాసంగ్లు పుల్ దృష్టికి ఈ విషయం తీసుకుని వెళ్లినట్లు చెప్పారు.

అంతర్జాతీయ సరిహద్దును గుర్తించాలని కోరారు ఇదిలా ఉండగా, అరుణాచల్ చైనాతో 1,126 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్నందున చైనాతో సరైన అంతర్జాతీయ సరిహద్దును గుర్తించాలని సామాజిక కార్యకర్త టబా టకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇండియా టుడేతో టాకు మాట్లాడుతూ, “భూమిని గుర్తించకపోవడం వలన లేదా సరిహద్దు గోడలు లేదా రెయిలింగ్‌లు లేనందున భారతీయ యువత చాలా సందర్భాలలో అంతర్జాతీయ సరిహద్దు దాటి వెళ్తోందని.. ముఖ్యంగా అంతర్జాతీయ సమీపంలో మూలికలు, కూరగాయలను వెతుక్కుంటూ అడవుల్లోకి వెళ్లి అనుకోకుండా చైనా భూభాగంలోకి ప్రవేశిస్తున్నారని తెలిపారు. గతంలో కూడా కొందరు యువకులను చైనా పీఎల్ఏ కిడ్నాప్ చేసింది. భారత్ నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో మళ్లీ విడుదల చేశారని గుర్తు చేశారు.

జనవరిలో కూడా అదే జరిగింది ఈ ఏడాది జనవరిలో అరుణాచల్ ప్రదేశ్‌లోని జిడోకు చెందిన 17 ఏళ్ల యువకుడు మిరామ్ తారోమ్ ఔషధ మొక్కలను వెతుక్కుంటూ చైనాలోకి ప్రవేశించాడు. అతను చైనా సైనికులచే బంధించబడ్డాడు. భారతదేశం జోక్యం తర్వాత కొన్ని రోజుల తరువాత విడిపించబడిన సంగతి తెలిసిందే.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..