AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monkey Funeral: విద్యుత్ షాక్ తో కోతి మృతి.. ఘనంగా అంత్యక్రియలు నిర్వహించిన గ్రామస్థులు.. మంగళవారం భోజనాలకు ఏర్పాటు

జితు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ.. హిందువులకు కోతులపై విశ్వాసం ఉందన్నారు. కోతి.. హనుమంతుడికి చిహ్నం. శనివారం హనుమంతుడికి ఇష్టమైన రోజు. కనుక మరణించిన కోతి చివరి ప్రయాణం అత్యంత ఘనంగా నిర్వహించాలని సూచించాడు.

Monkey Funeral: విద్యుత్ షాక్ తో కోతి మృతి.. ఘనంగా అంత్యక్రియలు నిర్వహించిన గ్రామస్థులు.. మంగళవారం భోజనాలకు ఏర్పాటు
Monkey Funeral
Surya Kala
|

Updated on: Oct 16, 2022 | 2:33 PM

Share

మనుషులు, జంతువుల మధ్య ప్రేమ శతాబ్దాల నాటిది. ఇందుకు ఎన్నో ఉదాహరణలు మనం చూస్తూనే ఉంటాం. చాలా సార్లు ఈ ఆప్యాయతకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. జంతువులు మనుషుల పట్ల చూపించే ప్రేమ, విశ్వాసం కొన్ని బంధాలకు ఉదాహరణగా నిలుస్తాయి కూడా. ఇటీవల కాలంలో ఇలాంటి ఉదాహరణతో కూడిన వీడియో ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. చాలా మంది ప్రజలు తమ పెంపుడు జంతువును పోగొట్టుకుంటే ఆలోచిస్తూనే ఉంటారు. తమ పెంపుడు జంతువుతో చాలా సమయం గడుపుతారు. తమకు అత్యంత ఇష్టమైన జంతువు ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్లడం భాదను కలిగిస్తుంది. ఆ బాధను భరించడం వారికి చాలా కష్టంగా మారుతుంది.. అయితే తమ పెంపుడు జంతువుతో ఇంతగా ప్రేమలో పడటం మీరు ఎప్పుడైనా చూశారా? ప్రస్తుతం మనసుని హత్తుకునే ఒక ఘటన తెరపైకి వచ్చింది.

ఈ ఘటన రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో చోటు చేసుకుంది. ఓ కోతి అకస్మాత్తుగా మరణించింది. దీని అంత్యక్రియల ఊరేగింపును బ్యాండ్ బాజాలతో  2 కిలోమీటర్ల మేర తీసుకుని వెళ్లారు. శ్మశానవాటికలో పూర్తి లాంఛనాలతో ఖననం చేసి, మంగళవారం ఆ కోతి  పేరు మీద కర్మను చేయనున్నారు. విద్యుదాఘాతానికి గురై కోతి మృతి చెందిందని తెలుస్తోంది. రెండు రోజులుగా చెట్టుకింద పడి ఉన్న కోతి శుక్రవారం మధ్యాహ్నం ఇంజనీర్ జస్వీర్‌సింగ్‌ చూశాడు. కోతి పరిస్థితిని చూసి.. వెంటనే ఆస్పత్రికి తీసుకుని వెళ్లి చికిత్స చేసే ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి:

వెంటనే గాయపడిన కోతిని డాగ్ సెంటర్‌కు తీసుకెళ్లాడు.. అక్కడ జీతు కోతిని చూసి జస్వీర్‌ను చికిత్స కోసం అల్వార్‌కు తీసుకెళ్లమని సూచించాడు. ఇంజనీర్ జస్వీర్ శుక్రవారం మధ్యాహ్నం కారులో కోతితో అల్వార్ చేరుకున్నాడు. అక్కడ జస్వీర్ చికిత్స చేయించాడు.  వెటర్నరీ డాక్టర్ వద్దకు తీసుకువెళ్లాడు. అయితే అక్కడ వైద్యులు కూడా కోతి ప్రాణాలను రక్షించలేకపోయారు. తర్వాత జీతూ కోతిని తమ స్వస్థలానికి తీసుకుని వచ్చాడు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశాడు.

జితు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ.. హిందువులకు కోతులపై విశ్వాసం ఉందన్నారు. కోతి.. హనుమంతుడికి చిహ్నం. శనివారం హనుమంతుడికి ఇష్టమైన రోజు. కనుక మరణించిన కోతి చివరి ప్రయాణం అత్యంత ఘనంగా నిర్వహించాలని సూచించాడు. బందర్ ప్రయాణం స్టేషన్ రోడ్ ప్రతాప్ బాస్ నుండి NEB శ్మశానవాటిక వరకు 2 కి.మీ అంతిమ యాత్ర నిర్వహించారు. ఇక్కడ కోతి మృతదేహం  అలంకరించబడిన చేతి బండిలో కూర్చొబెట్టి.. ఊరేగింపుగా తీసుకుని వెళ్లారు. బ్యాండ్ ను కూడా ఏర్పాటు చేశారు. ఆపై పూర్తి ఆచారాలతో కోతిమృత దేశానికి దహన సంస్కారాలు నిర్వహించారు. మీడియాతో మాట్లాడిన జీతూ.. ఊరేగింపు సందర్భంగా బజరంగ్ బాలి కీ జై అంటూ నినాదాలు చేశారు. యాత్రలో ప్రజలు కూడా పాల్గొన్నారు. ఇప్పుడు మంగళవారం కర్మ  చేయడానికి ప్లాన్ చేస్తున్నాని తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..