Manoj Singh Mandavi: ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ స్పీకర్ మనోజ్ సింగ్ మాండవి కన్నుమూత.. పలువురు నేతల సంతాపం..

ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ ఎమ్మెల్యే మనోజ్‌ సింగ్‌ మాండవి ఆదివారం గుండెపోటుతో కన్నుమూశారు.

Manoj Singh Mandavi: ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ స్పీకర్ మనోజ్ సింగ్ మాండవి కన్నుమూత.. పలువురు నేతల సంతాపం..
Manoj Singh Mandavi
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 16, 2022 | 2:55 PM

ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ ఎమ్మెల్యే మనోజ్‌ సింగ్‌ మాండవి ఆదివారం గుండెపోటుతో కన్నుమూశారు. మనోజ్ సింగ్ మాండవి (58) ఆదివారం ఉదయం గుండెపోటుతో మరణించినట్లు కాంగ్రెస్ పార్టీ నేతలు పేర్కొన్నారు. మాండవి తన స్వగ్రామమైన నాథియా సవాగాన్‌లో శనివారం రాత్రి ఛాతీలో నొప్పితోపాటు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను హుటాహుటిన చరమలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కొసం కుటుంబసభ్యులు ధామ్‌తరి పట్టణంలోని ఆసుపత్రికి తరలించారని.. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని రాష్ట్ర కాంగ్రెస్ కమ్యూనికేషన్ వింగ్ హెడ్ సుశీల్ ఆనంద్ శుక్లా తెలిపారు. కంకేర్ జిల్లాలోని భానుప్రతాప్‌పూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మాండవి శనివారం రాత్రి జిల్లాలోని చరమా ప్రాంతంలోని తన స్వగ్రామమైన నాథియా నవాగావ్‌లో ఉన్నారని అధికారులు తెలిపారు.

గిరిజన నేత అయిన మనోజ్‌ సింగ్‌ మాండవి భానుప్రతాప్‌పూర్‌ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2000- 2003 వరకు అజిత్‌జోగి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేశారు. బస్తర్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి

కాగా.. మనోజ్ మాండవి మృతి పట్ల ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్ బాగేల్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సంతాపం తెలియజేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే