UIDAI: ఆధార్‌ విషయంలో మరో కీలక నిర్ణయం.. అప్పుడే పుట్టిన పిల్లలకు ఆధార్‌తో పాటు..

ఆధార్‌ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రప్రభుత్వం. అప్పుడేపుట్టిన పిల్లలకు బర్త్‌ సర్టిఫికెట్‌తోపాటు ఆధార్‌ వెంటనే ఇవ్వాలని నిర్ణయించింది. 16 రాష్ట్రాల్లో ప్రస్తుతం ఈ విధానం అమలులో ఉండగా..

UIDAI: ఆధార్‌ విషయంలో మరో కీలక నిర్ణయం.. అప్పుడే పుట్టిన పిల్లలకు ఆధార్‌తో పాటు..
Aadhaar
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 16, 2022 | 2:29 PM

ఆధార్‌ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రప్రభుత్వం. అప్పుడేపుట్టిన పిల్లలకు బర్త్‌ సర్టిఫికెట్‌తోపాటు ఆధార్‌ వెంటనే ఇవ్వాలని నిర్ణయించింది. 16 రాష్ట్రాల్లో ప్రస్తుతం ఈ విధానం అమలులో ఉండగా.. త్వరలోనే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ విధానం అమలు పరుస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ అధికారులు చెప్పారు. ప్రస్తుతం తెలంగాణతో పాటు మరో 15 రాష్ట్రాల్లో ఈ విధానం అమలులో ఉంది. తెలంగాణలో బర్త్‌ రిజిస్ట్రేషన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేశారు అధికారులు. గత ఏడాది నుంచే ఈ విధానం అమల్లోకి వచ్చింది. తాజాగా ఈ నిర్ణయాన్ని అన్ని రాష్ట్రాల్లో అములు పరిచేలా చర్యలను ముమ్మరం చేసింది ఉడాయ్‌.

ప్రస్తుతం ఐదేళ్లలోపు చిన్నారులకు బాల ఆధార్‌ ఇష్యూ చేస్తున్నారు అధికారులు. ఈ ఆధార్ కోసం పిల్లల వేలిముద్రలు, ఐరిస్‌ను నమోదు చేయడం లేదు. వారి ఫొటోను తల్లిదండ్రుల ఆధార్‌తో అనుసంధానం చేస్తున్నారు. ఆ తర్వాత 5 నుంచి 15 ఏళ్ల వయస్సు మధ్యలో బయోమెట్రిక్‌ను అప్‌డేట్‌ చేసుకునే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 1000 రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను ఆధార్‌ ఆధారంగానే నిర్ణయిస్తున్నారు. దీంతో ఆధార్‌ను మరింత పటిష్ట పరిచేందుకు ఉడాయ్‌ చర్యలు ప్రారంభించింది. ఇక నుంచి దేశ వ్యాప్తంగా పుట్టిన వెంటనే బర్త్ సర్టిఫికేట్ తో పాటు ఆధార్ జారీ చేయాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు 134 కోట్ల ఆధార్‌ కార్డులను జారీ చేసినట్లు చెప్పింది ఉడాయ్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..