AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MBBS in Hindi: ప్రిస్క్రిప్షన్ పై ‘శ్రీహరి’ అని రాయాల్సిందే.. సీఎం సంచలన నిర్ణయం..

హాస్పిటల్స్ లో డాక్టర్లు రాసే ప్రిస్క్రిప్షన్ పై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మందుల చీటీ రాసేటప్పుడు మొదట పై భాగంలో శ్రీహరి అని రాసి, ఆ తర్వాత మందుల..

MBBS in Hindi: ప్రిస్క్రిప్షన్ పై 'శ్రీహరి' అని రాయాల్సిందే.. సీఎం సంచలన నిర్ణయం..
Shivraj Singh Chouhan
Ganesh Mudavath
|

Updated on: Oct 16, 2022 | 10:57 AM

Share

హాస్పిటల్స్ లో డాక్టర్లు రాసే ప్రిస్క్రిప్షన్ పై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మందుల చీటీ రాసేటప్పుడు మొదట పై భాగంలో శ్రీహరి అని రాసి, ఆ తర్వాత మందుల పేర్లు, వివరాలు రాయాలని పేర్కొన్నారు. హిందీలో వైద్య విద్య పూర్తిచేసిన డాక్టర్లు ఈ విధానాన్ని అమలుపరచాలని చెప్పారు. పిల్లల్లో హిందీ పట్ల అభిమానాన్ని పెంచేందుకు ఈ చర్యలు తీసుకున్నామని సీఎం చెప్పారు. ఇంగ్లిష్‌ మందుల పేర్లను హిందీలో రాస్తే వచ్చి ఇబ్బంది ఏమిటని ఆయన ప్రశ్నించారు. వైద్యులు రాసే మెడికల్‌ ప్రిస్క్రిప్షన్‌కు సంబంధించి మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్ ఒక కొత్త భాష్యం చెప్పారు. మెడికల్‌ ప్రిస్క్రిప్షన్‌ను వైద్యులు ఇంగ్లిష్‌కు బదులుగా హిందీలో ఎందుకు రాయకూడదని ప్రశ్నించారు. క్రోసిన్‌ మందు రాయాలనుకున్నప్పుడు హిందీలో క్రోసిన్‌ అని రాస్తే వచ్చే సమస్య ఏముంటుందని అన్నారు. ఇక నుంచైనా వైద్యులు హిందీలోనే మెడికల్‌ ప్రిస్క్రిప్షన్‌ రాయడం అలవాటు చేసుకోవాలని సూచించారు. భోపాల్‌లో నిర్వహించిన హిందీ వ్యాఖ్యాన్‌ కార్యక్రమంలో సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ పాల్గొన్నారు. తాను ఇంగ్లీష్ భాషకు వ్యతిరేకం కాదని, అయితే జాతీయ భాష అయిన హిందీకి అధిక ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు.

కొన్ని దేశాలు తమ జాతీయ భాషల్లోనే అన్ని పనులు చేసుకుంటున్నాయి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నాయి. ఇంగ్లిష్‌ లేకుండా ఏ పని చేయలేమనే ఆలోచన నుంచి బయటకు రావాలి. రష్యా, జర్మనీ, జపాన్‌, చైనా దేశాల్లో ఇంగ్లిష్‌ ఎవరూ మాట్లాడరు. వారి మాతృభాషల్లోనే అన్ని కార్యాలు చక్కబెట్టుకుంటారు. దేశంలో కూడా ఇంగ్లిష్‌కు బదులుగా హిందీని ఎక్కువగా ఉపయోగించాలి.

– శివరాజ్ సింగ్ చౌహాన్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి

ఇవి కూడా చదవండి

కాగా.. దేశంలో తొలిసారిగా 2022-23 విద్యా సంవత్సరం నుంచి ఎంబీబీఎస్ ను హిందీ మీడియంలో ప్రవేశ పెట్టారు. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో ఈ విధానాన్ని అమలు చేయనున్నారుర. గతేడాది నుంచి బీటెక్‌ను ప్రాంతీయ భాషల్లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. మెడికల్ విద్యను కూడా హిందీలో అందించేందుకు రెండు రాష్ట్రాలు ముందుకువచ్చాయి. మధ్యప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని భోపాల్‌లోని గాంధీ మెడికల్‌ కాలేజ్‌, ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లోని అటల్‌ బిహారీ వాజ్‌పేయ్‌ యూనివర్సిటీ తొలుత ఎంబీబీఎస్‌ కోర్సును హిందీ మీడియంలో బోధనను అందించనున్నారు. ఈ రెండు మెడికల్ కాలేజీలు ప్రభుత్వం ఆధీనంలో నడిచేవి కావడం విశేషం.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి