Petrol, Diesel Prices Today: నిలకడగా పెట్రోల్, డీజిల్ ధరలు.. ప్రధాన నగరాల్లో ధరల వివరాలు..
పెట్రోల్, డీజిల్ ధరల్లో రోజూ వారి హెచ్చు, తగ్గులు ఉంటుండటంతో ఏ రోజు ఎంత అనేది తెలియడం లేదు. ఫ్యూయల్ స్టేషన్ కి వెళ్లి పెట్రోల్ లేదా డీజిల్ కొట్టించే వరకు లీటర్ ధర ఎంతో తెలియడం లేదు. అయితే గతంలో ప్రతి రోజూ పెరుగతూ వచ్చిన ఫ్యూయల్ ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు ఏ రోజు ఎంత ఉంటాయనే విషయంలో వాహనాదారులు కూడా రోజూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. గతంలో ఆరు నెలలకో, ఏడాదికో ఒక సారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ ఉండేవి. దీంతో నిర్ధిష్టంగా ఇంత ధర అని వాహనదారులకు తెలిసేది. కొన్నేళ్లుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో రోజూ వారి హెచ్చు, తగ్గులు ఉంటుండటంతో ఏ రోజు ఎంత అనేది తెలియడం లేదు. ఫ్యూయల్ స్టేషన్ కి వెళ్లి పెట్రోల్ లేదా డీజిల్ కొట్టించే వరకు లీటర్ ధర ఎంతో తెలియడం లేదు. అయితే గతంలో ప్రతి రోజూ పెరుగతూ వచ్చిన ఫ్యూయల్ ధరలు కొద్ది రోజులుగా నిలకడగా ఉంటున్నాయి. ప్రస్తుతం పలు ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100కు పైగానే ఉంది. తాజాగా అక్టోబర్ 16వ తేదీ పెట్రోల్, డీజిల్ ధరలను ప్రధాన నగరాల్లో ఏలా ఉన్నాయో తెలుసుకుందాం.
దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు:
దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72 ఉండగా, డీజిల్ ధర రూ.89.62.
ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.35 ఉండగా, డీజిల్ ధర రూ.97.28 ఉంది.
కోల్‌కతాలో లీటర్ పెట్రల్ ధర రూ.106.03 ఉండగా, డీజిల్ ధర రూ.92.76 ఉంది.
చెన్నైలో లీటర్ పెట్రల్ ధర రూ.102.63 ఉండగా, డీజిల్ ధర రూ.94.24 ఉంది.
హైదరాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66 ఉండగా, డీజిల్ ధర రూ.97.82 వద్ద కొనసాగుతోంది.
విశాఖపట్టణంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.48 ఉండగా, డీజిల్ ధర రూ.98.27 వద్ద కొనసాగుతోంది.
నేషనల్ క్యాపిటల్ రీజియన్ నొయిడాలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.79 ఉండగా, డీజిల్ ధర రూ.89.96
పెట్రోల్, డీజిల్ ధరలను చెక్ చేసుకోండిలా..
ఇక మీరు పెట్రోల్, డీజిల్ ధరలను చెక్ చేసుకోవాలంటే మీరు ఇంట్లోనే ఉండి చేసుకునే సదుపాయం కూడా ఉంది. కేవలం మొబైల్ నుంచి ఎస్‌ఎంఎస్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ధరను చెక్ చేయడానికి ఇండియన్ ఆయిల్ (ఐఓసీ) వినియోగదారు RSP<డీలర్ కోడ్> అని రాసి 9224992249 నంబర్‌కు పంపాలి. అదే సమయంలో, HPCL వినియోగదారులు 9222201122 నంబర్‌కు HPPRICE <డీలర్ కోడ్> అని టైప్ చేయడం ద్వారా, అలాగే BPCL (BPCL) వినియోగదారులు RSP<డీలర్ కోడ్> అని టైప్ చేయడం చేసి 9223112222కు SMS పంపండి. ధరలను తెలుసుకునేందుకు ఈ లింక్ ద్వారా కోడ్‌ను తెలుసుకోవచ్చు.