Egg For Weight Loss: గుడ్లను తింటే వేగంగా బరువు తగ్గుతారా..? దేనితో కలిపి తింటే మంచిది..

గుడ్డులో ఎన్నో పోషకాలు, ప్రొటిన్లు దాగున్నాయి.. అందుకే.. రోజూ ఒక గుడ్డు తినాలంటూ ఆరోగ్య నిపుణులు తరచూ సలహా ఇస్తుంటారు. అయితే.. గుడ్డులోని పోషకాలు

Egg For Weight Loss: గుడ్లను తింటే వేగంగా బరువు తగ్గుతారా..? దేనితో కలిపి తింటే మంచిది..
Eggs
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 15, 2022 | 9:42 PM

గుడ్డులో ఎన్నో పోషకాలు, ప్రొటిన్లు దాగున్నాయి.. అందుకే.. రోజూ ఒక గుడ్డు తినాలంటూ ఆరోగ్య నిపుణులు తరచూ సలహా ఇస్తుంటారు. అయితే.. గుడ్డులోని పోషకాలు బరువు తగ్గడంలోనూ సహాయపడతాయి. ఒక వేళ మీరూ బరువు పెరగడం వల్ల ఇబ్బంది పడుతున్నా.. బరువు తగ్గాలని ఆలోచిస్తున్నా.. గుడ్డు మంచి ఎంపిక అని సూచిస్తున్నారు. గుడ్లు ప్రోటీన్ మంచి మూలంగా పరిగణిస్తారు. దీనితో పాటు, క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు గుడ్లలో తక్కువ మొత్తంలో లభిస్తాయి. అందుకే ఆహారంలో గుడ్లను చేర్చుకోవడం వల్ల బరువు తగ్గడం సులభం అవుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. దీనితో పాటు, ఇది కండరాలను నిర్మించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే బరువు తగ్గేందుకు, ఆరోగ్యంగా ఉండేందుకు గుడ్లు ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం.

గుడ్డు ప్రయోజనాలు

గుడ్లలో ఖనిజాలు, విటమిన్లు, సెలీనియం, కోలిన్ పుష్కలంగా ఉన్నాయని మనందరికీ తెలుసు. దీనితో, ఇది రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. గుడ్ల నిర్దిష్ట ఆహారం బరువును సమర్థవంతంగా తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. బరువు తగ్గాలనుకునే వారు తమ ఆహారంలో ఉడికించిన గుడ్లు లేదా మామూలుగా వండిన గుడ్లను చేర్చుకోవచ్చు. ఇది అదనపు కొవ్వును తగ్గిస్తుంది. గుడ్డులోని తెల్లసొన బరువు తగ్గడానికి సహాయపడుతుంది. జిమ్‌కు వెళ్లే వారికి గుడ్లు చాలా మేలు చేస్తాయి.

నల్ల మిరియాల పొడితో గుడ్లు తింటే చాలా మంచిది..

మసాలా దినుసు నల్ల మిరియాలు ప్రతి ఇంట్లో ఉంటాయి. ఈ నల్ల మిరియాల పొడిని గుడ్లతో పాటు తీసుకోవడం వల్ల బరువును వేగంగా తగ్గుతారు. ఎందుకంటే నల్ల మిరియాలు ఒక రకమైన వేడి మసాలా, ఇది జీవక్రియ రేటును మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియ సమస్యను తొలగిస్తుంది. దీనితో పాటు, శరీరంలో అదనపు కొవ్వు పేరుకుపోవడానికి ఇది అనుమతించదు. మీరు గుడ్డు ఆమ్లెట్ మీద, లేదా ఉడికించిన గుడ్లపై నల్ల మిరియాల పొడిని ఉపయోగించి తీసుకోవచ్చు. ఇది కొవ్వును బర్న్ చేసే ప్రక్రియను వేగవంతం చేస్తుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?