AAI Recruitment 2022: నెలకు రూ.లక్షకుపైగా జీతంతోఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ పోస్టులు.. ఇంటర్/డిగ్రీ అర్హతలు..
భారత ప్రభుత్వ పౌరవిమానయాన మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా.. జూనియర్, సీనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల..
భారత ప్రభుత్వ పౌరవిమానయాన మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా.. 55 జూనియర్, సీనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి పోస్టును బట్టి ఇంటర్మీడియట్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, బీకాం, హిందీ/ఇంగ్లిష్ స్పెషలైజేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. హిందీ/ఇంగ్లిష్‌లో టైపింగ్ స్కిల్స్ ఉండాలి. లైట్/మీడియం/హెవీ మోటర్ వెహికల్ లైసెన్స్ కూడా ఉండాలి. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం తప్పనిసరిగా ఉండాలి. సెప్టెంబర్ 30, 2022వ తేదీ నాటికి దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితి విషయంలో సడలింపు వర్తిస్తుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 14, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్/ఓబీసీ అభ్యర్ధులు రూ.1000లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ /ఎక్స్ సర్వీస్‌మెన్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.31,000ల నుంచి రూ.1,10,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలకు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు..
- సీనియర్ అసిస్టెంట్ (అధికారిక భాష) పోస్టులు: 6
- జూనియర్ అసిస్టెంట్ (హ్యూమన్ రిసోర్స్) పోస్టులు: 7
- సీనియర్ అసిస్టెంట్ (ఆపరేషన్స్) పోస్టులు: 4
- సీనియర్ అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్స్) పోస్టులు: 3
- సీనియర్ అసిస్టెంట్ (ఫైనాన్స్) పోస్టులు: 12
- జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీసెస్) పోస్టులు: 23
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.