TMC Recruitment 2022: నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.. హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్‌లో ఉద్యోగాలు.. నెల జీతం రూ.లక్ష
టాటా మెమోరియల్ సెంటర్‌కి చెందిన ముజఫర్‌పూర్‌లోని హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్‌లో.. 172 డిస్ట్రిక్ట్ టెక్నికల్ ఆఫీసర్, నర్స్, మెడికల్ ఆఫీసర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల..

టాటా మెమోరియల్ సెంటర్‌కి చెందిన ముజఫర్‌పూర్‌లోని హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్‌లో.. 172 డిస్ట్రిక్ట్ టెక్నికల్ ఆఫీసర్, నర్స్, మెడికల్ ఆఫీసర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్, బీకాం, ఎంకాం, ఎంబీఏ, ఎంబీబీఎస్, ఎండీ, ఎంపీహెచ్, బీడీఎస్, బీఎన్‌ఎం లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అలాగే దరఖాస్తుదారుల వయసు 45 నుంచి 55 యేళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు సంబంధిత డాక్యుమెంట్లతో కింది అడ్రస్‌లో అక్టోబర్ 19, 20, 21, 27 తేదీల్లో నిర్వహించే ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావచ్చు. ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ.18,000ల నుంచి రూ.1,00,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చెక్ చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు..
- అకౌంటెంట్ పోస్టులు: 3
- అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు: 2
- రాష్ట్ర ప్రోగ్రామ్ మేనేజర్ పోస్టులు: 1
- మెడికల్ ఆఫీసర్ పోస్టులు: 6
- క్లస్టర్ కోఆర్డినేటర్ పోస్టులు: 8
- డిస్ట్రిక్ట్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు: 76
- నర్స్ పోస్టులు: 76
అడ్రస్: HOMI BHABHA CANCER HOSPITAL AND RESEARCH CENTRE, SHRI KRISHNA MEDICAL COLLEGE AND HOSPITAL CAMPUS, UMANAGAR, MUZAFFARPUR (BIHAR)- 842004, PHONE NUMBER: 9472377509.




పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




