AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Current Affairs 2022: వైఎస్సార్‌ లైఫ్‌ టైం ఎచీవ్‌మెంట్ 2022 అవార్డులు ప్రకటించిన ఏపీ సర్కార్‌.. విజేతలు వీళ్లే..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2022వ సంవత్సరానికి గానూ వైఎస్సార్‌ లైఫ్‌ టైం ఎచీవ్‌మెంట్, వైఎస్సార్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాల్లో సామాన్యులుగా ఉన్న అసామాన్యులను గుర్తించి, వారిని ఎంపిక చేశారు. 2022 సంవత్సరం రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను..

AP Current Affairs 2022: వైఎస్సార్‌ లైఫ్‌ టైం ఎచీవ్‌మెంట్ 2022 అవార్డులు ప్రకటించిన ఏపీ సర్కార్‌.. విజేతలు వీళ్లే..
YSR lifetime achievement award 2022
Srilakshmi C
|

Updated on: Oct 14, 2022 | 7:37 PM

Share

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2022వ సంవత్సరానికి గానూ వైఎస్సార్‌ లైఫ్‌ టైం ఎచీవ్‌మెంట్, వైఎస్సార్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాల్లో సామాన్యులుగా ఉన్న అసామాన్యులను గుర్తించి, వారిని ఎంపిక చేశారు. 2021 సంవత్సరం రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నవంబరు 1న తొలిసారి 62 సంస్థలకు ఈ అవార్డులను ప్రధానం చేశారు. ఇక ఈ ఏడాది కూడా నవంబర్‌ 1న ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ అత్యున్నత పురస్కారాలను ప్రదానం చేస్తోంది. మన గ్రామం, మన వ్యవసాయం, మన కళలు, సాహిత్యం, సంస్కృతి–సంప్రదాయాలు, సమాజ సంక్షేమం–అభివృద్ధి… వంటి రంగాల్లో విశేష కృషి చేసిన వ్యక్తులు/సంస్థలకు 2022 నవంబరు 1న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మొత్తంగా 30 అవార్డులను అందించనున్నారు. వీటిల్లో 20… జీవిత సాఫల్య పురస్కారాలు (లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్‌ అవార్డులు), 10… సాఫల్య పురస్కారాలు (ఎచీవ్‌మెంట్‌ అవార్డులు) ఉన్నాయి.

వ్యవసాయం

  • ఆదివాసీ కేష్యూనట్‌ ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ– సోడెం ముక్కయ్య – బుట్టాయగూడెం, ఏలూరు జిల్లాకు.
  • కుశలవ కోకోనట్‌ ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్స్‌ కంపెనీ – ఎ.గోపాలకృష్ణ; బి.ఆర్‌. అంబేద్కర్‌ కోనసీమ జిల్లాకు;
  • అన్నమయ్య మ్యూచువల్లీ ఎయిడెడ్‌ కోఆపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌ – జయబ్బనాయుడు, తలుపల గ్రామం, పీలేరు మండలం, అన్నమయ్య జిల్లాకు;
  • అమృత ఫల ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ –కె.ఎల్‌.ఎన్‌. మౌక్తిక, సబ్బవరం, అనకాపల్లి జిల్లాకు
  • కట్టమంచి బాలకృష్ణారెడ్డి, కట్టమంచి గ్రామం, చిత్తూరు జిల్లాకు… కమిటీ సమాలోచనల తరవాత తుది జాబితాగా ప్రతిపాదించటం జరిగింది. – వీరందరికీ వైఎస్సార్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డులు ప్రకటించారు.

కళలు–సంస్కృతి విభాగంలో…

  • కళాతపస్వి, నిండు తెలుగుదనం ఉట్టిపడే తెలుగువాడు కె.విశ్వనాథ్‌కి…
  • బడుగు బలహీన వర్గాల కోసం, గ్రామం కోసం, పేదల కోసం… నిరంతరం తపించి జీవితాన్ని అర్పించిన ఆర్‌. నారాయణమూర్తికి
  • సుప్రసిద్ధ రంగస్థల కళాకారుడు నాయుడు గోపీ…
  • మన కలంకారీ… పెడన నేతన్న పిచుక శ్రీనివాస్‌కు
  • దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన ఉదయగిరి ఉడెన్‌ కట్లరీ… అంటే వంటింట్లో వాడే చెక్క వస్తువుల తయారీలో శ్రీమతి షేక్‌ గౌసియా బేగం గారికి… వైఎస్సార్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డులను ప్రకటించారు.

సాహిత్య సేవలో…

  • విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌
  • ఎమెస్కో ప్రచురణాలయానికి…
  • రచయిత డాక్టర్‌ శాంతి నారాయణ… వారి సేవలకు జీవిత కాల సాఫల్య పురస్కారాలను ప్రకటించారు.

మహిళా సాధికారత–రక్షణ విభాగంలో…

  • ప్రజ్వలా ఫౌండేషన్‌– సునీతా కృష్ణన్‌…
  • ఉయ్యూరుకు చెందిన శిరీషా రిహేబిలిటేషన్‌ సెంటర్‌…
  • దిశ–పోలీసింగ్‌కు వైఎస్సార్‌ లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్‌ అవార్డు ప్రకటించారు. నేరం జరగక ముందు, జరుగుతోందనే సమాచారం అందిన వెంటనే బాదితులను ఆదుకునే వ్యవస్థగా రాష్ట్ర సర్కార్‌ దిశ యాప్‌ తీసుకొచ్చింది.

– దిశ యాప్‌ద్వారా వచ్చిన ఎస్‌వోఎస్‌ను అందుకున్న వెంటనే నిమిషాల్లోనే సంఘటన స్థలానికి చేరుకుని కాపాడిన అయిదుగురు పోలీసులకు ఈ ఏడాది వైఎస్సార్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డును ఉమ్మడిగా ప్రకటించారు. – రవాడ జయంతి; ఎస్‌వీవీ లక్ష్మీనారాయణ; రాయుడు సుబ్రహ్మణ్యం, హజ్రతయ్య; పి.శ్రీనివాసులు… వీరికి సంయుక్తంగా వైఎస్సార్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డుకు ఎంపిక చేశారు.

విద్యా రంగం నుంచి…

  • మదనపల్లి – రిషీ వేలీ విద్యా సంస్థకు
  • కావలి– జవహర్‌ భారతి విద్యా సంస్థకు.. ఈ రెండు విద్యా సంస్థలకు వైఎస్సార్‌ లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్‌ అవార్డు ప్రకటించారు.
  • మనస్తత్వ శాస్త్రాల నిపుణుడు బి.వి.పట్టాభిరాంకు… లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్‌
  • బ్యాంకింగ్‌ రంగంలో వేల మంది ప్రవేశానికి దారి చూపిన దార్శనికుడు, మంచి మాస్టారు నంద్యాలకు చెందిన దస్తగిరి రెడ్డికి వైఎస్సార్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డు
  • మీడియా అవార్డులు- సీనియర్‌ పాత్రికేయులు 1) భండారు శ్రీనివాసరావు 2) సతీశ్‌ చందర్‌ 3) మంగు రాజగోపాల్‌ 4) ఎంఈవీ ప్రసాదరెడ్డి – ఈ నలుగురికీ వైఎస్సార్‌ లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్‌ అవార్డులు ప్రకటించారు.

వైద్య రంగంలో విప్లవాలకు అంటుకట్టిన…

  • డాక్టర్‌ బి. నాగేశ్వరరెడ్డి, ఏఐజీకి… ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ
  • డాక్టర్‌ వరప్రసాదరెడ్డి, శాంతా బయోటెక్‌… (హెపటైటిస్‌–బి వ్యాక్సిన్‌)
  • భారత్‌ బయోటెక్‌ డాక్టర్‌ కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లాలకు… (కోవాక్సిన్‌)
  • అపోలో హాస్పటల్స్‌ వ్యవస్థాపకుడు, ఛైర్మన్‌ ప్రతాప్‌ సి రెడ్డి…
  • ఎల్‌.వి.ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌ తరఫున గుళ్ళపల్లి నాగేశ్వరరావు

ఈ అయిదు సంస్థలు/వ్యక్తులకు వైఎస్సార్‌ లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్‌ అవార్డులు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

పారిశ్రామిక రంగంలో..

అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన గ్రంధి మల్లికార్జునరావుగారికి… వైఎస్సార్‌ లైఫ్‌ టైం ఎచీవ్‌మెంట్‌ అవార్డు ప్రకటించారు.

రంగాల వారీగా చూస్తే...

వ్యవసాయానికి 5; సంస్కృతి–సంప్రదాయాలకు 5; మహిళా సాధికారత, రక్షణకు 3; తెలుగు భాషకు 3; విద్యా రంగానికి 4; మీడియా నుంచి 4; వైద్య రంగానికి 5; పరిశ్రమకు 1 అవార్డు ఇవ్వనున్నట్లు శుక్రవారం జరిగిన ప్రెస్‌మీట్‌లో సమాచార శాఖ కమిషనర్ టి. విజయకుమార్ రెడ్డి వెల్లడించారు.