AP PGCET Results 2022: ఏపీ పీజీసెట్‌-2022 ఫలితాలు విడుదల.. ఈ లింక్‌ ద్వారా డైరెక్ట్‌గా రిజల్ట్స్‌ చెక్‌ చేసుకోండి

Srilakshmi C

Srilakshmi C |

Updated on: Oct 14, 2022 | 5:52 PM

ఆంధ్రప్రదేశ్‌లో 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి పలు పోస్టు గ్రాడ్యుయేషన్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ పీజీ సెట్-2022 పరీక్ష ఫలితాలను కడప యోగి వేమన యూనివర్సిటీ ఈ రోజు (అక్టోబర్‌ 14) విడుదల చేసింది..

AP PGCET Results 2022: ఏపీ పీజీసెట్‌-2022 ఫలితాలు విడుదల.. ఈ లింక్‌ ద్వారా డైరెక్ట్‌గా రిజల్ట్స్‌ చెక్‌ చేసుకోండి
AP PGCET 2022 Results

ఆంధ్రప్రదేశ్‌లో 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి పలు పోస్టు గ్రాడ్యుయేషన్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ పీజీ సెట్-2022 పరీక్ష ఫలితాలను కడప యోగి వేమన యూనివర్సిటీ ఈ రోజు (అక్టోబర్‌ 14) విడుదల చేసింది. ఏపీ స్టేట్‌ హైయర్ ఎడ్యుకేషన్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ హేమచంద్రారెడ్డి చేతుల మీదుగా ఈ ఫలితాలను విడుదల చేశారు. ఏపీ పీజీ సెట్-2022 పరీక్షకు హాజరైన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌ లో ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు.

కడప యోగి వేమన యూనివర్సిటీ ఆధ్వర్యలో సెప్టెంబర్‌ 3, 4, 7, 10, 11 తేదీల్లో నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షకు మొత్తం 39,359 మంది అభ్యర్ధులు హాజరయ్యారు. మొత్తం 147 సబ్జెక్టుల్లో పీజీ సెట్‌ నిర్వహించారు. వీటిల్లో సంస్కృతం, ఉర్దూ, తమిళం, బీఎఫ్‌ఏ, పెర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌ అండ్‌ మ్యూజిక్‌, ఆర్ట్స్‌, టూరిజం, జియోగ్రఫీ సబ్జెక్టులకు తక్కువ దరఖాస్తులు వచ్చినందున పరీక్ష నిర్వహించ లేదు నేరుగా డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా ఆయా కోర్సుల్లో సీట్ల కేటాయింపు చేయనున్నట్లు కౌన్సిల్‌ తెల్పింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu