GAIL Limited: బీటెక్‌ నిరుద్యోగులకు చివరి అవకాశం! మరికొన్ని గంటల్లో ముగియనున్న దరఖాస్తు ప్రక్రియ.. ఇక్కడ నేరుగా అప్లై చేసుకోండి..

భారత ప్రభుత్వ పెట్రోలియం, న్యాచులర్ గ్యాస్ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని గెయిల్‌ ఇండియా లిమిటెడ్‌ దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ యూనిట్లలో 77 మేనేజర్‌, ఇంజనీర్‌, ఆఫీసర్‌ పోస్టులకు ఇంకా దరఖాస్తు చేసుకోలేదా? మరికొన్ని గంటల్లో ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులకు..

GAIL Limited: బీటెక్‌ నిరుద్యోగులకు చివరి అవకాశం! మరికొన్ని గంటల్లో ముగియనున్న దరఖాస్తు ప్రక్రియ.. ఇక్కడ నేరుగా అప్లై చేసుకోండి..
GAIL Limited
Follow us

|

Updated on: Oct 14, 2022 | 5:00 PM

భారత ప్రభుత్వ పెట్రోలియం, న్యాచులర్ గ్యాస్ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని గెయిల్‌ ఇండియా లిమిటెడ్‌ దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ యూనిట్లలో 77 మేనేజర్‌, ఇంజనీర్‌, ఆఫీసర్‌ పోస్టులకు ఇంకా దరఖాస్తు చేసుకోలేదా? మరికొన్ని గంటల్లో ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులకు ఇదే చివరి అవకాశం. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా, బీఈ, బీటెక్‌, బీఏ, బీఎస్సీ, బీకాం, సీఏ, సీఎంఏ, ఎంకాం, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంఎస్సీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించిన వారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే సంబంధిత పనిలో నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారలు వయసు 37 యేళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో రేపు (అక్టోబర్‌ 15, 2022) సాయంత్రం 6 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐతే జనరల్ అభ్యర్ధులు రూ.200లు అప్లికేషన్‌ ఫీజుగా చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.29,000ల నుంచి రూ.2,00,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • మేనేజర్(ఎఫ్‌ అండ్‌ ఎస్‌) పోస్టులు
  • మేనేజర్ (మార్కెటింగ్- సీఆర్‌ఎం) పోస్టులు
  • మేనేజర్ (మార్కెటింగ్ ఇంటర్నేషనల్, షిప్పింగ్) పోస్టులు
  • సీనియర్ ఇంజినీర్ (మెకానికల్) పోస్టులు
  • సీనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) పోస్టులు
  • సీనియర్ ఇంజినీర్ (కెమికల్) పోస్టులు
  • సీనియర్ ఇంజినీర్ (గెయిల్‌టెల్‌ టీసీ/ టీఎం) పోస్టులు
  • సీనియర్ ఇంజినీర్ (బాయిలర్ ఆపరేషన్స్) పోస్టులు
  • సీనియర్ ఆఫీసర్ (ఎఫ్‌ అండ్‌ ఎస్‌) పోస్టులు
  • సీనియర్ ఇంజినీర్ (సివిల్) పోస్టులు
  • సీనియర్ ఆఫీసర్ (సి అండ్‌ పి) పోస్టులు
  • సీనియర్ ఆఫీసర్ (బీఐఎస్‌) పోస్టులు
  • సీనియర్ ఆఫీసర్ (మార్కెటింగ్) పోస్టులు
  • సీనియర్ ఆఫీసర్ (హెచ్‌ఆర్‌) పోస్టులు
  • సీనియర్ ఆఫీసర్ (ఎఫ్‌ అండ్‌ ఎ) పోస్టులు
  • సీనియర్ ఆఫీసర్ (సీసీ) పోస్టులు
  • ఆఫీసర్ (ల్యాబొరేటరీ) పోస్టులు
  • ఆఫీసర్ (ఓఎల్‌) పోస్టులు
  • సీనియర్ ఇంజినీర్ (ఇన్‌స్ట్రుమెంటేషన్) పోస్టులు
  • ఆఫీసర్ (ఒఎల్‌) పోస్టులు
  • సీనియర్ సూపరింటెండెంట్ (హిందీ) పోస్టులు
  • సీనియర్ అకౌంటెంట్ పోస్టులు
  • సీనియర్ సూపరింటెండెంట్ (హెచ్‌ఆర్‌) పోస్టులు
  • సీనియర్ కెమిస్ట్ పోస్టులు
  • ఫోర్‌మ్యాన్ (ఎలక్ట్రికల్) పోస్టులు
  • ఫోర్‌మ్యాన్ (ఇన్‌స్ట్రుమెంటేషన్) పోస్టులు
  • ఫోర్‌మ్యాన్(మెకానికల్) పోస్టులు

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.