IIM Recruitment 2022: నెలకు రూ.2 లక్షల జీతంతో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో టీచింగ్ ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండా ఎంపిక..
భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన కేరళలోని కొజికోడ్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్.. 16 అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల..
భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన కేరళలోని కొజికోడ్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్.. 16 అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫైనాన్స్, ఎకనామిక్స్, హ్యూమానిటీస్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. ఏదైనా గుర్తింపు పొందియన యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా టీచింగ్ అనుభవం కూడా ఉండాలి.
ఈ అర్హతలున్నవారు ఎవరైనా అక్టోబర్ 31, 2022వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. అనంతరం హార్డు కాపీలను డౌన్‌లోడ్ చేసుకుని కింది అడ్రస్‌కు నవంబర్ 10వ తేదీలోపు పోస్టు ద్వారా పంపించవల్సి ఉంటుంది. షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ప్రతిభ కనబరచిన వారికి నెలకు రూ.1,01,500ల నుంచి రూ.2,11,300ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
అడ్రస్:
Dean (FA&D), Indian Institute of Management Kozhikode, IIM Kozhikode Campus Post, Kozhikode, Kerala-673570.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.