ఇక తెలంగాణ విద్యాసంస్థలన్నింటిలో బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి: విద్యా శాఖ
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరి చేస్తూ విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు..
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరి చేస్తూ విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బందికి ఆధార్‌తో కూడిన బయోమెట్రిక్ హాజరును తప్పనిసరిగా అమలు చేయాలని పేర్కొంటూ తెలంగాణ సర్కార్ అన్ని విద్యా సంస్థలను ఆదేశించింది. ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో ఈ పద్ధతిని అనుసరించాలని తెల్పింది. ఈ విధమైన అటెండెన్స్ కాలిక్యులేషన్ సహాయంతో విద్యార్ధులను పై తరగతులకు ప్రమోట్ చేయడం, స్కాలర్‌షిప్, ఫీ రియంబర్స్‌మెంట్ వంటి వాటికి ఉపయోగించనున్నట్లు వెల్లడించింది. అదేవిధంగా బోధన, బోధనేతర సిబ్బంది డ్యూటీ గంటలు, సెలవును లెక్కించడానికి ఉపయోగించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా కోవిడ్ మహమ్మరి కారణంగా బయోమెట్రిక్ హాజరు నిలిపివేయడం జరిగింది. ఈ మేరకు సంబంధించి చర్యలను వేగవంతం చేయాలని విద్యా శాఖ సెక్రెటరీ వాకాటి కరుణ అదేశాలు జారీ చేశారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.