Infosys: ‘వర్క్‌ ఫ్రమ్‌ హోం’పై ఇన్ఫోసిస్‌ కీలక నిర్ణయం.. ఈ విధానం మరికొంత కాలం కొనసాగింపు!

కరోనా మహమ్మారి కాలం నుంచి చాలా మంది ఉద్యోగులు వర్క్‌ఫ్రం హోం చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత ఒక్కో కంపెనీలు తమ..

Infosys: ‘వర్క్‌ ఫ్రమ్‌ హోం’పై ఇన్ఫోసిస్‌ కీలక నిర్ణయం.. ఈ విధానం మరికొంత కాలం కొనసాగింపు!
Infosys
Follow us
Subhash Goud

|

Updated on: Oct 14, 2022 | 5:41 PM

కరోనా మహమ్మారి కాలం నుంచి చాలా మంది ఉద్యోగులు వర్క్‌ఫ్రం హోం చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత ఒక్కో కంపెనీలు తమ ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించి పనులు చేయిస్తున్నాయి. ఇప్పటికి కొన్ని సాఫ్ట్‌వేర్‌ కంపెనీల ఉద్యోగులు ఇంటి నుంచే విధులు నిర్వహిస్తున్నారు. ఇక ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ ఉద్యోగులకు కల్పించిన వర్క్‌ఫ్రం హోం విధానంపై కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఉద్యోగులను కార్యాలయానికి రావాలని తప్పనిసరి చేయబోమని స్పష్టం చేసింది. ప్రస్తుతం తాము అవలంబిస్తున్న హైబ్రిడ్‌ విధానం (కొన్ని రోజులు ఇంటి నుంచి మరి కొన్ని రోజులు ఆఫీస్‌ నుంచి) వల్ల ఎలాంటి ఇబ్బందులు రావడం లేదని సీఈవో సలీల్‌ పరేఖ్‌ పేర్కొన్నారు. వల్ల ఎలాంటి ఇబ్బంది రావడం లేదని, ఈ విధానాన్ని మరికొంత కాలాన్ని కొనసాగించనున్నట్లు ఆయన చెప్పారు. అయితే ఉద్యోగులు తప్పకుండా ఇన్ని రోజులు కార్యాలయంకు రావాలని అనే రూల్‌ ఏమి లేదని, వారిపై ఎలాంటి నియమాలు పెట్టబోమని ఆయన స్పష్టం చేశారు.

వర్క్‌ఫ్రం హోమ్‌ విధానంపై ఇప్పటి వరకు కంపెనీ తీసుకున్న నిర్ణయాలపై ఉద్యోగుల నుంచి మంచి స్పందన వస్తోందని అన్నారు. ప్రస్తుతం కార్యాలయాల్లో ఏ సమయంలోనైనా 45 వేలకు తగ్గకుండా ఉద్యోగులు పని చేస్తున్నారని అన్నారు. కొన్ని నెలల కిందటితో పోల్చినట్లయితే ఈ సంఖ్య ఎక్కువేనని అన్నారు. అంతేకాకుండా ఉద్యోగులు కార్యాలయంకు వచ్చేందుకు అన్ని విధాలుగా సహకరిస్తామని, ఎక్కువ మంది కార్యాలయానికి వచ్చేందుకు ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు. కొన్ని సందర్భాలలో క్లయింట్ల అవసరానికి అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుందన్నారు.

కొత్తగా 50 వేల నియామకాలు:

కాగా, ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 50 వేల మంది ఫ్రెషర్స్‌ను నియమించుకుంటామని గతంలో ఇన్ఫోసిస్‌ ప్రకటించింది. ఇందులో తొలి ఆరు నెలల్లో 40 వేల నియమకాలు పూర్తి చేయగా, సెప్టెంబర్‌ త్రైమాసికంలో నికరంగా ఉద్యోగుల సంఖ్య 10,032 మేర పెరిగిందన్నారు. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 3,45,218కు చేరిందన్నారు. అలాగే ఒకేసారి రెండు కంపెనీలకు ఉద్యోగాలు చేయడం తాము వ్యతిరేకమని ఇన్ఫోసిస్ స్పష్టం చేసింది. ఉద్యోగుంలదరికీ కొత్త టెక్నాలజీని నేర్చుకునేందుకు అవకాశాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి