Idli ATM: ఇడ్లీలు వేస్తోన్న ఏటీఎం.. స్కాన్ చేస్తే చాలు.. టెస్ట్ సూపరంటూ లాగించేస్తున్ జనాలు..

ఇడ్లీలు తినాలని ఉందా..? వడా తినాలని ఉందా..? నో టెన్షన్ ఇందిగా ఏటీఎం. డబ్బులు కాదండి బాబు.. ఇప్పుడు మీరు ఏది కోరితే అది క్షణాల్లో వండి వార్చేందుకు ఏటీఎం వచ్చేశాయి. ఇంత కాలం నోట్ల కట్టలను అందించే ఏటీఎంలను మనం చూశాం.. ఇప్పుడు కాలం మారింది. మీరు కోరిన టిఫిన్(ఇడ్లీ, వడా) రెడీగా మీ చేతిలోకి వేడి వేడిగా వచ్చేస్తాయి. ఎక్కడా..? ఏంటి అని తొందరగా ఉందా..? అయితే చదవండి..

Idli ATM: ఇడ్లీలు వేస్తోన్న ఏటీఎం.. స్కాన్ చేస్తే చాలు.. టెస్ట్ సూపరంటూ లాగించేస్తున్ జనాలు..
Idli Atm
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 14, 2022 | 6:17 PM

బెంగుళూరు అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది సాఫ్ట్‌వేర్. ఆ తర్వాత గుర్తుకువచ్చేది ఓ అందమైన నగరం. ఇంత వరకు ఓకే.. ఇప్పుడు ఈ స్మార్ట్ సిటీ కాస్తా మరింత స్మార్ట్‌గా మారిపోయింది. ఓ స్టార్టప్ కంపెనీ చేసిన ఈ ఆవిష్కరణతో మరోసారి బెంగుళూరు తన ప్రత్యేకతను కాపాడుకుంది. ఎందుకంటే 24*7 పని చేసే ఇక్కడివారికి ఎప్పుడంటే అప్పుడు టిఫిన్‌ను వేడి వేడిగా అందిస్తోంది “ఇడ్లీ ATM”.  బెంగుళూరుకు చెందిన శరణ్ హిరేమత్, సురేష్ చంద్రశేఖరన్ ఈ ఇడ్లీ ఏటీఎంను ఏర్పాటు చేశారు. స్టార్టప్ ఫ్రెషాట్ రోబోటిక్స్‌ ఈ యంత్రాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఈ వివరాలను ఓ  యూజర్ తన ట్విట్టర్‌‌ వేదికపై ఈ ఏటీఏం ఇడ్లీ సెంటర్ వీడియోను పోస్ట్ చేశారు. దీంతో ఇది కాస్తా వైరల్ అవుతోంది. ఇది పూర్తి-ఆటోమేటెడ్, కాంటాక్ట్‌లెస్ ప్రక్రియ ద్వారా నీట్‌గా ప్యాక్ చేసి, స్టీమింగ్ ఇడ్లీలు నిమిషాల్లో డెలివరీ చేయడాన్ని మనం ఈ వీడియోలో చూడవచ్చు.

ఈ యంత్రాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన వ్యక్తిగత అనుభవం నుంచి వచ్చింది. ఇది 2016లో శరణ్ హిరేమత్ తాను అనారోగ్యంతో ఉన్న కుమార్తె కోసం అర్థరాత్రి ఇడ్లీలు కొనాలనుకున్నాడు. ఎక్కడా రెస్టారెంట్లు తెరిచి లేవు. దీంతో ఈ కొత్త ఆవిష్కరణకు తొలి బీజం పడింది.

దీన్ని ఇడ్లీ బాట్ లేదా ఇడ్లీ ఏటీఎం అని పిలుస్తారు. ఇడ్లీ తయారు చేయడం, ప్యాకేజీ  చేయడం, సప్లై చేయడం లాంటి అన్ని ప్రక్రియలను వెంటవెంటనే చేస్తోంది. అంతే కాదు.. కరెన్సీ కూడా అవసరం లేదు.. ఇందులో డిజిటల్ పే సౌకర్యం కూడా ఉంది.

బెంగళూరులో మొదటి ఎక్స్‌పీరియెన్స్ స్టోర్‌ను ఏర్పాటు చేసింది ఈ స్టార్టప్. మొత్తం ఆటోమేటెడ్ ప్రాసెస్‌లో పనిచేస్తుంది. కస్టమర్ వచ్చి తమకు కావాల్సిన ఆర్డర్ ఇస్తే చాలు, వేడివేడి ఇడ్లీ పార్శిల్‌లో వచ్చి మన చేతిలో ఉంటుంది. ప్యాకింగ్‌ పల్లి చట్నీ, సాంబార్ కూడా వచ్చేస్తుంది. ఇలా నీట్‌గా ఉన్న పార్శిల్‌ను ఇంటికి కూడా తీసుకెళ్లొచ్చు. లేదా ఇడ్లీ అక్కడే టేస్ట్ చేయొచ్చు.

ఇడ్లీ ఏటీఎంను ఈ వీడియోలో చూడండి..

ఎప్పుడంటే అప్పుడు డబ్బులు తీసుకోవడానికి ఏటీఎంలు ఉన్నట్లుగానే ఇడ్లీ కూడా తీసుకోకుంటే ఎంత బాగుంటుందో అనే ఓ చిన్న ఐడియా ఈ ఇండ్లీ ఏటీఎంలను మార్కెట్ లోకి తీసుకొచ్చింది.  ఎప్పుడైనా ఫ్రెష్ ఇడ్లీ సప్లై చేయడానికి ఇడ్లీ ఏటీఎం తయారు చేయాలన్న ఆలోచనతో ఫ్రెషాట్ రోబోటిక్స్ స్టార్టప్‌ ప్రారంభించారు. మన ఊరిలో కూడా ఉంటే ఎంత బాగుండో అని ఉంది కదు.. మీరు కూడా ట్రై చేయండి. ఎందుకు ఆలస్యం.. డబ్బుకు డబ్బు.. కొత్తగా ప్రారంభించామన్న క్రెడిట్ మన పేరుతో ఉండిపోతుంది.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!