Spain: భారత్ పట్ల స్పెయిన్ అవమానకరమైన కార్టూన్.. వెల్లువెత్తుతున్న విమర్శలు
స్పెయిన్‌కు చెందిన ప్రధాన పత్రిక ‘ లా వంగార్డియా’ భారత్ పట్ల అతిగా ప్రవర్తించింది. ‘పాములు ఆడించే వ్యక్తి’ ప్రతిబింబించే కార్టూన్‌ను ఉపయోగించి..
స్పెయిన్‌కు చెందిన ప్రధాన పత్రిక ‘ లా వంగార్డియా’ భారత్ పట్ల అతిగా ప్రవర్తించింది. ‘పాములు ఆడించే వ్యక్తి’ ప్రతిబింబించే కార్టూన్‌ను ఉపయోగించి భారత ఆర్థిక వృద్ధిని వర్ణించింది. భారత్ పట్ల మూసభావననే ప్రతిబింబిస్తూ ప్రచురించిన ఈ కార్టూన్ ద్వారా జాతివిద్వేషాన్ని వెళ్లగక్కుతున్నట్టుగా ఉంది. ఈ కార్టూన్‌ను అక్టోబర్ 9న వీక్లీ పత్రికలో మొదటి పేజీలో ప్రచురితమైంది. ‘ ది హవర్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ’ పేరిట భారత ఆర్థిక వ్యవస్థ స్థితిని ‘పాములు ఆడించే వ్యక్తి’ కార్టూన్‌తో వర్ణిస్తూ ఈ వార్తను ప్రచురించడంపై ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత్ స్వాతంత్ర్యం పొంది దశాబ్ధాలు గడుస్తున్నా, శాస్త్రసాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్నా ఇంకా ఇలా అవమానకరంగా ప్రచురించడం సరికాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ అంశంపై బెంగళూరు సెంట్రల్ బీజేపీ లోక్‌సభ ఎంపీ పీసీ మోహన్ స్పందించారు. భారత్‌కు ఎంతో గుర్తింపున ఉందని, ఆర్థిక వ్యవస్థగా ఇండియాకు గ్లోబల్ గుర్తింపు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన దశాబ్దాల తర్వాత కూడా తమను పాముల్ని ఆడించేవాళ్లగా చూపడం మూర్ఖత్వమే అవుతుందని ఆయన మండిపడ్డారు. విదేశీ మనస్థత్వాలను మార్చాలనే ప్రయత్నం కాస్త కష్టమేనని ఆయన అన్నారు. ఇక స్టాక్ బ్రోకింగ్ కంపెనీ జిరోధా సీఈవో నితిన్ కామన్ కూడా దీనిపై స్పందించారు. కాస్త శాంతించండి .. ప్రపంచం చూస్తోంది. కానీ భారత్‌ను ఇంకా సాంప్రదాయ కార్టూన్లతో చూపించడం చాలా అవమానకరం.. ఇలా కార్టూన్‌తో ప్రచురించడం చాలా దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. ఇలా భారత్ ను పాములు పట్టే దేశంగా అభివర్ణించడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఏదీ ఏమైనా భారతదేశ ఎకానమీపై ఆర్టికల్ రాసే క్రమంలో భారత్ ను పాములు పట్టే దేశం అనే అర్థం వచ్చేలా కార్టూన్‌ను ప్రచురించడం ఇప్పుడు తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి