AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI ఆర్బీఐ కీలక నిర్ణయం.. ఈ 8 సంస్థలు వ్యాపారంపై నిషేధం.. రిజిస్ట్రేషన్‌ రద్దు

నిబంధనలు ఉల్లంఘించిన బ్యాంకులపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కఠినంగా వ్యవహరిస్తోంది. నాలుగు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు..

RBI ఆర్బీఐ కీలక నిర్ణయం.. ఈ 8 సంస్థలు వ్యాపారంపై నిషేధం.. రిజిస్ట్రేషన్‌ రద్దు
RBI
Subhash Goud
|

Updated on: Oct 14, 2022 | 5:14 PM

Share

నిబంధనలు ఉల్లంఘించిన బ్యాంకులపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కఠినంగా వ్యవహరిస్తోంది. నాలుగు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ) తమ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌లను సరెండర్ చేశాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. అలాగే నాలుగు ఎన్‌బీఎఫ్‌సీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు రద్దు చేసినట్లు తెలిపింది. ఇప్పుడు ఈ 8 సంస్థలు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్‌బిఎఫ్‌సి)గా వ్యాపారం చేయలేవని ఆర్‌బిఐ ప్రకటనలో తెలిపింది. నాలుగు ఎన్‌బీఎఫ్‌సీ తమ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌లను ఆర్బీఐకి సరెండర్ చేసినట్లు రిజర్వ్‌ బ్యాంకు తెలిపింది. ఇందులో అశ్విని ఇన్వెస్ట్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఆర్‌ఎమ్ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్, అమిటీ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్, మ్యాట్రిక్స్ మర్చండైజ్ లిమిటెడ్ వంటి ఎన్‌బీఎఫ్‌సీలున్నాయని తెలిపింది. మరోవైపు ఆర్బీఐ ఇతర ఎన్‌బీఎఫ్‌సీ ఎఆర్‌ఎం ప్రాపర్టీస్, ఫైనాన్స్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, నార్త్ ఈస్ట్ రీజియన్ ఫిన్ సర్వీసెస్ లిమిటెడ్, సోజెన్వీ ఫైనాన్స్ లిమిటెడ్, ఒపాల్ ఫైనాన్స్ లిమిటెడ్ సర్టిఫికెట్లను రద్దు చేసింది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934 ప్రకారం ఈ కంపెనీలు ఎలాంటి వ్యాపారం చేయవని ఆర్‌బీఐ తెలిపింది. అలాగే దేశంలో ఇలాంటి ప్లాట్‌ఫారమ్‌లు చట్టవిరుద్ధంగా నడుస్తున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ గతంలో పేర్కొంది. మనీలాండరింగ్‌కు కూడా ఉపయోగపడే ఖాతాలను ఆర్‌బీఐ పర్యవేక్షిస్తుంది.

వ్యాపారంపై నిషేధం

ఈ సంస్థల దుర్వినియోగాన్ని నివారించడానికి వాటి సమీక్షను రద్దు చేస్తామని ఆర్బీఐ తెలిపింది. అలాగే, అక్రమ రుణ యాప్‌కు సంబంధించిన పలు అంశాలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. న్యూఢిల్లీకి చెందిన అశ్విని ఇన్వెస్ట్‌మెంట్స్ 2002లో లైసెన్స్ పొందగా, ఆర్‌ఎం సెక్యూరిటీస్, అమిటీ ఫైనాన్స్, మ్యాట్రిక్స్ మర్చండైజ్ తమ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌ను వరుసగా 2001, 2000, 2008లో పొందాయి. ఇప్పుడు ఇవి తమ వ్యాపారంలో లావాదేవీలు చేయడానికి అనుమతి ఉండదు.

ఇవి కూడా చదవండి

క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ రద్దు

అక్టోబర్ 6, 2022న క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ బ్రిక్‌వర్క్ రేటింగ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ యొక్క సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ (సీఓఆర్‌)ని క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ (ఎస్‌ఈబీఐ) రద్దు చేసిందని ఆర్బీఐ తెలిపింది. రేటింగ్ ఏజెన్సీ తన కార్యకలాపాలను 6 నెలల్లో మూసివేయాలని ఆదేశించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి