AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JioMart: దీపావళికి ముందే జియో స్మార్ట్‌ ‘బెస్టివల్ సేల్’.. 80 శాతం వరకు డిస్కౌంట్‌

దీపావళి పండగ వచ్చేస్తోంది. పలు ఇ-కామర్స్‌ దిగ్గజాలు, ఇ తర సంస్థలు భారీ ఎత్తున ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. దీపావళి పండుగ సమీపిస్తున్నందున ఆఫర్ల మీద ఆఫర్లు అందుబాటులోకి..

JioMart: దీపావళికి ముందే జియో స్మార్ట్‌ 'బెస్టివల్ సేల్'.. 80 శాతం వరకు డిస్కౌంట్‌
Jiomart
Subhash Goud
|

Updated on: Oct 14, 2022 | 2:56 PM

Share

దీపావళి పండగ వచ్చేస్తోంది. పలు ఇ-కామర్స్‌ దిగ్గజాలు, ఇ తర సంస్థలు భారీ ఎత్తున ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. దీపావళి పండుగ సమీపిస్తున్నందున ఆఫర్ల మీద ఆఫర్లు అందుబాటులోకి వస్తుంటాయి. ప్రజల కొనుగోలు కోసం మార్కెట్‌లో భారీ రద్దీ నెలకొంది. కస్టమర్లను తమవైపు ఆకర్షించేందుకు పెద్ద పెద్ద కంపెనీలు అనేక రకాల విక్రయాలు, ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి. ఇప్పుడు దేశంలోని అతిపెద్ద రిటైల్ కంపెనీ అయిన రిలయన్స్ రిటైల్‌కు చెందిన జియోమార్ట్, స్మార్ట్ స్టోర్‌లు 2022 అక్టోబర్ 14 నుండి దీపావళికి ప్రత్యేక సేల్‌ను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించాయి. ఇందులో కస్టమర్లు వెస్ట్ డీల్స్ పొందుతారు. అందుకే ఈ సెల్ పేరు ‘బెస్టివల్ సెల్’ అని పేట్టారు..

ఈ సేల్ 14 అక్టోబర్ నుండి 24 అక్టోబర్ 2022 వరకు జియో స్మార్ట్‌, జియో స్మార్ట్‌సేల్‌ ఫెస్టివల్ సేల్, స్మార్ట్‌ స్టార్స్‌, రిలయన్స్‌ రిటైల్‌లో ప్రారంభమవుతుంది. ఇందులో ఇ-ప్లాట్‌ఫారమ్ జియోమార్ట్‌తో పాటు 3000కు పైగా స్మార్ట్ స్టోర్‌లు కూడా ప్రత్యక్షంగా ఉంటాయి. ఇందులో స్మార్ట్ బజార్, స్మార్ట్ పాయింట్, స్మార్ట్ సూపర్‌స్టోర్‌లను కలిపారు. ఈ సేల్‌లో కస్టమర్లు బంపర్ డిస్కౌంట్లను పొందే అవకాశం దక్కుతుంది. ఇక్కడ షాపింగ్ చేయడం ద్వారా మీరు 80% వరకు తగ్గింపు పొందవచ్చు. రిలయన్స్ రిటైల్‌కు 200 మిలియన్లకు పైగా కస్టమర్‌లు ఉన్నారు. ఇందులో రిలయన్స్ రిటైల్‌తో పాటు దాని చుట్టూ ఉన్న స్మార్ట్ స్టోర్‌లను సేల్‌లో చేర్చడం ద్వారా కంపెనీ విపరీతమైన తగ్గింపు ఆఫర్‌ను అందిస్తోంది.

కస్టమర్‌లు 80% వరకు తగ్గింపు:

జియో స్మార్ట్‌కు చెందిన ప్రత్యేక ‘బెస్టివల్ సేల్’లో మీరు వివిధ కేటగిరిల్లో షాపింగ్ చేయడం ద్వారా 80% వరకు తగ్గింపును పొందవచ్చని రిలయన్స్‌ జియో స్మార్ట్‌ తెలిపింది. దీపావళి సందర్భంగా కొవ్వొత్తులు, స్వీట్లు, డ్రై ఫ్రూట్స్, స్నాక్స్ మొదలైన వాటిపై 80% వరకు తగ్గింపు పొందవచ్చని తెలిపింది. మరోవైపు మీరు ఇండియన్ స్వీట్స్, డ్రై ఫ్రూట్స్‌పై 50% ప్రత్యేక తగ్గింపును పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

ఈ సేల్‌లో మీరు టీవీ, ఫ్రిజ్, స్మార్ట్‌వాచ్, గృహోపకరణాలు వంటి ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువును కొనుగోలు చేస్తున్నట్లయితే ఈ సేల్‌లో మీరు కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ నుంచి 10% వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ డీల్‌ను అక్టోబర్ 16 వరకు పొందవచ్చు. డిన్నర్ సెట్లు, డ్రై ఫ్రూట్స్, స్నాక్స్, చాక్లెట్లు మొదలైన వాటిపై 50% తగ్గింపు వరకు డిస్కౌంట్‌ పొందవచ్చు. దీనితో పాటు పిల్లలు, పురుషులు, మహిళల దుస్తులపై కూడా డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ కాకుండా, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) క్రెడిట్ కార్డ్‌లతో షాపింగ్ చేయడంపై 10% తక్షణ తగ్గింపును పొందవచ్చు.

అలాగే పండగ సందర్భంగా ఇతర వస్తువులు, వస్తువులు, దుస్తులు, సౌందర్య ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్ వస్తువులపై ఈ అద్భుతమైన ఆఫర్‌ను సొంతం చేసుకోవాలని కోరింది. విభిన్న భారతీయ చేనేత, హస్తకళ పరిశ్రమ, పోచంపల్లి చీరలు, బంధాని దుస్తులు, మొరాదాబాద్ నుండి ఇత్తడి గిన్నెలు, పూజ ఉపకరణాలతో పాటు ఇతర వాటిపై ఆఫర్లు సొంతం చేసుకోవచ్చు. స్మార్ట్‌ టీవీలు, స్మార్ట్‌వాచ్‌లు, మొబైల్, కంప్యూటర్‌పై 80% వరకు తగ్గింపు పొందవచ్చు. రిఫ్రిజిరేటర్లు, గృహోపకరణాలు, మరెన్నో వస్తువులపై డిస్కౌంట్‌ను పొందవచ్చని తెలిపింది. ఇలా రకరకాల ఉత్పత్తులపై రిలయన్స్‌ జియో స్మార్ట్‌ ఆఫర్లను ప్రకటించింది. పండగ సీజన్స్‌ ఉండటంతో పోటాపోటీగా ఇ-కామర్స్‌ దిగ్గజాలు భారీ ఆఫర్లను వినియోగదారుల ముందుకు వస్తున్నాయి. ఇందులోభాగంగా జియో స్మార్ట్‌ కూడా తమ స్టోర్‌లలో లభించే వివిధ రకాల ఉత్పత్తులపై ఆఫర్లను ప్రకటించింది.

డెలాయిట్ గ్లోబల్ పవర్స్ ఆఫ్ రిటైలింగ్‌లో ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రిటైలర్లలో జాబితా చేయబడిందని గ్రోసరి రిలయన్స్‌ రిలైల్‌ సీఈవో దామోదర్ మాల్ అన్నారు. ఇది టాప్ గ్లోబల్ రిటైలర్‌ల జాబితాలో 56వ స్థానంలో ఉందని అన్నారు. జియో స్మార్ట్‌ అనేది 2020లో ప్రారంభించబడిన రిలయన్స్ రిటైల్ కు చెందిన డిజిటల్ కామర్స్ ప్లాట్‌ఫారమ్.

కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు తమ సంస్థను బలోపేతం చేస్తున్నామన్నారు. భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ ఇ-మార్కెట్‌ప్లేస్ లు ఉన్నాయి. కస్టమర్ల అద్భుతమైన అనుభవాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తుందని అన్నారు. మరిన్ని వివరాలకు కోసం www.jiomart.comని సందర్శించాలని, లేదా యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆయన కోరారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి