Gold Price Today: మూడు రోజుల తర్వాత పెరిగిన పసిడి ధర.. నాలుగోరోజూ తగ్గిన వెండి ధర.. ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..
బంగారం ధరలు ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ పరిస్థితుల్లో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, వడ్డీ రేట్లలో హెచ్చుతగ్గులు, నగల మార్కెట్‌లతో సహా అనేక పరిణామాల ప్రభావం బంగారం, వెండి ధరలపై ఆధారపడి ఉంటాయి. అక్టోబర్ 13వ తేదీ గురువారంతో పోలిస్తే అక్టోబర్ 14వ తేదీ శుక్రవారం బంగారం..
మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర ఈరోజు (14 అక్టోబర్ 2022 ) స్వల్పంగా పెరిగింది. ముందు రోజుతో పోలిస్తే దాదాపు 22, 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు సుమారు రూ.10 వరకు పెరిగింది. బంగారం అంటే భారతీయులకు ఎంతో మక్కువ. ఏ మాత్రం డబ్బులు ఉన్నా ముందు బంగారం కొన్ని పెట్టుకుందామనుకుంటారు. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా.. మన దగ్గర ఉన్న బంగారమే మన ఆస్తి అవుతుందని చాలా మంది పేద, మధ్య తరగతి ప్రజలు సైతం బంగారం కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అదే కొంత ఉన్నత వర్గాలకు, ధనిక కుటుంబాలకు చెందిన వారైతే.. మార్కెట్లోకి వచ్చే నూతన మోడల్స్ ను కొనుగోలు చేసి.. ఆ ఆభరణాలతో తమను అలంకరించుకుంటారు. ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనేటప్పుడు చూసేది ధర, గతంలో ధర ఎలా ఉంది, భవిష్యత్తులో తగ్గుతుందా, పెరుగుతుందా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇలా గత కొద్దిరోజులుగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూసి పెరిగితే కొద్ది రోజులు ఆగుదామని, ధర కొంత తగ్గుదల కొనిపిస్తే వెంటనే కొనుగోలు చేయడం చేస్తుంటారు. మరి ఈరోజు (14 అక్టోబర్ 2022) బంగారం, వెండి ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో సహా, దేశంలోని ప్రధాన నగరాల్లో ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం.
బంగారం ధరలు ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ పరిస్థితుల్లో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, వడ్డీ రేట్లలో హెచ్చుతగ్గులు, నగల మార్కెట్‌లతో సహా అనేక పరిణామాల ప్రభావం బంగారం, వెండి ధరలపై ఆధారపడి ఉంటాయి. అక్టోబర్ 13వ తేదీ గురువారంతో పోలిస్తే అక్టోబర్ 14వ తేదీ శుక్రవారం బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర
హైదరాబాలో 22 క్యారెట్ల బంగారం ధర చూసుకుంటే గురువారం ధరతో పోలిస్తే శుక్రవారం బంగారం ధర స్వల్పంగా పెరిగింది. బంగారం గ్రామునకు రూ.10 పెరిగింది. గ్రాము బంగారం ధర బుధవారం రూ.4,675గా ఉండగా, పది గ్రాముల బంగారం ధర రూ.46,750గా ఉంది. 24 క్యారెట్ల బంగారం కూడా గురువారంతో పోలిస్తే శుక్రవారం ధర గ్రామునకు రూ.11 పెరిగింది. గ్రాము బంగారం ధర 5,100గా ఉండగా, పది గ్రాముల బంగారం ధర రూ.51,000గా ఉంది. ఇవే ధరలు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖ పట్నంతో పాటు తెలంగాణలోని వరంగల్ లో కూడా కొనసాగుతున్నాయి.
వివిధ నగరాలలో బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో కూడా 22, 24 క్యారెట్ల బంగారానికి సంబంధించి గురువారంతో పోలిస్తే శుక్రవారం స్వల్పంగా పెరిగింది. 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ. 4,690గా ఉంది. పది గ్రాముల బంగారం ధర రూ.46,900గా ఉంది. 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర ఢిల్లీలో రూ.5,115గా ఉంది. అదే పది గ్రాముల బంగారం అయితే రూ.51,150గా ఉంది.
దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర ఈరోజు (శుక్రవారం) రూ.4,675గా ఉంది. అదే పది గ్రాముల బంగారం ధర రూ.46,750గా ఉంది. ప్యూర్ గోల్డ్ 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.5,100గా ఉంది. పది గ్రాముల బంగారం ధర రూ.51,000గా ఉంది.
దేశంలో అన్ని ప్రధాన నగరాల్లో కంటే చెన్నైలో పసిడి ధరలు అధికంగా ఉన్నాయి. గురువారం ధరతో పోలిస్తే గ్రాము బంగారానికి రూ.30 పెరిగింది. శుక్రవారం (అక్టోబర్14) గ్రాము బంగారం ధర రూ. 4,760గా ఉండగా, పది గ్రాముల బంగారం ధర చెన్నైలో రూ.47,600గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే గురువారంతో పోలిస్తే శుక్రవారం గ్రాము బంగారం ధర రూ.33 తగ్గింది. దీంతో గ్రాము బంగారం ధర రూ.5,193కు చేరుకోగా, పది గ్రాముల బంగారం ధర రూ.51,930గా ఉంది.
దేశంలో వెండి ధరలు
దేశీయంగా పసిడి ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపించగా.. వెండి ధర స్వల్పంగా తగ్గింది. మన దేశంలో పెళ్లిళ్లు, ఫంక్షన్లు, పూజలు వంటి సమయంలో వెండి వస్తువుల ఖరీదుకి ఆసక్తిని చూపిస్తారు. గురువారం ధరలతో పోలిస్తే శుక్రవారం వెండి ధర కిలోకు రూ.500 తగ్గింది. దీంతో హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్టణంతో పాటు తెలంగాణలోని వరంగల్ నగరాల్లో నేడు వెండి ధర కిలో రూ.62,500గా ఉంది. వెండి ధర గత మూడు రోజులు కలిపి కిలోకు దాదాపు రూ.3500 తగ్గింది.
Note: పైన పేర్కొన్న బంగారం ధరలు GST, TCS వంటివి కలిపిన ధరలు కావు.. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని సంప్రదించాల్సి ఉంటుంది. ఈ పసిడి వెండి ధరలు.. ఈ రొజు ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అయితే ఈ ధరలలో హెక్చుతగ్గులు స్థానిక పరిస్థితిని బట్టి కూడా ఏర్పడవచ్చు. కొనుగోలు దారులు ఈ విషయాన్నీ గమనించాల్సి ఉంటుంది.