Captain Movie: అప్పుడే ఓటీటీలోకి ఆర్య ‘కెప్టెన్‌’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

Captain OTT Release: కోలీవుడ్ హీరో ఆర్య హీరోగా తెరకెక్కిన చిత్రం కెప్టెన్‌. లేటెస్ట్‌ సెన్సేషన్‌ ఐశ్వర్య లక్ష్మి నటించగా.. సీనియర్‌ నటి సిమ్రాన్‌ ఆర్మీ ఆఫీసర్‌గా స్పెషల్‌ రోల్‌ పోషించింది

Captain Movie: అప్పుడే ఓటీటీలోకి ఆర్య 'కెప్టెన్‌'.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Captain Movie
Follow us
Basha Shek

|

Updated on: Sep 23, 2022 | 6:45 AM

Captain OTT Release: కోలీవుడ్ హీరో ఆర్య హీరోగా తెరకెక్కిన చిత్రం కెప్టెన్‌. లేటెస్ట్‌ సెన్సేషన్‌ ఐశ్వర్య లక్ష్మి నటించగా.. సీనియర్‌ నటి సిమ్రాన్‌ ఆర్మీ ఆఫీసర్‌గా స్పెషల్‌ రోల్‌ పోషించింది. శక్తి సౌందన్‌ రాజన్‌ సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సెప్టెంబర్‌ 8న తమిళ్‌తో పాటు తెలుగు భాషల్లో విడుదలైన ఈ చిత్రం యావరేజ్‌ టాక్‌ తెచ్చుకుంది. సుమారు రూ.30 కోట్లతో తెరకెక్కిన ఈ సైంటిఫిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఓ మోస్తరు కలెక్షన్లు మాత్రమే తెచ్చుకుంది. థియేటర్‌ రిలీజ్‌లో పెద్దగా ఆకట్టుకోని కెప్టెన్‌ ఇప్పుడు డిజిటల్‌ ప్రీమియర్‌కు సిద్ధమైంది.

కాగా ఈ సినిమా డిజిటల్‌ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ స్టూడియోస్ సొంతం చేసుకుంది. సాధారణంగా సినిమా థియేటర్లలో విడుదలైన నెల రోజుల తర్వాతే ఓటీటీ స్ట్రీమింగ్‌ అవ్వాలి. కానీ కెప్టెన్‌ మాత్రం మూడు వారాలకే డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. సెప్టెంబర్ 30 నుంచి ఈ సినిమా తమిళ్‌తో పాటు తెలుగు భాషల్లో ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. తాజాగా ఈ విషయాన్ని జీ5 స్టూడియోస్‌ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. తమిళ్‌లో టి.కిషోర్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ఠ్‌ మూవీస్‌ సమర్పించింది. హరీశ్‌ ఉత్తమన్‌, కావ్య శెట్టి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇమ్మాన్‌ స్వరాలు సమకూర్చారు. మరి థియేటర్లలో కెప్టెన్‌ విన్యాసాలను చూడలేని వారు ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?