The Ghost: ఘోస్ట్‌ సినిమా కోసం ఇంత శ్రద్ధ తీసుకున్నారా.? ఆశ్చర్యపరుస్తోన్న మేకింగ్ వీడియో..

The Ghost: కింగ్‌ నాగార్జున హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'ది ఘోస్ట్‌'. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్‌ అండ్వాంచర్‌ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. గరుడవేగతో భారీ విజయాన్ని అందుకున్న ప్రవీణ్‌..

The Ghost: ఘోస్ట్‌ సినిమా కోసం ఇంత శ్రద్ధ తీసుకున్నారా.? ఆశ్చర్యపరుస్తోన్న మేకింగ్ వీడియో..
The Ghost
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 23, 2022 | 6:53 AM

The Ghost: కింగ్‌ నాగార్జున హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ది ఘోస్ట్‌’. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్‌ అండ్వాంచర్‌ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. గరుడవేగతో భారీ విజయాన్ని అందుకున్న ప్రవీణ్‌.. దాదాపు అలాంటి కాన్సెప్ట్‌తో తెరకెక్కిస్తోన్న చిత్రం కావడంతో అందరి దృష్టి ఈ చిత్రంపై పడింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్‌ 5న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే ట్రైలర్‌ను విడుదల చేసిన చిత్ర యూనిట్ తాజాగా.. సినిమాకు సంబంధించి మేకింగ్‌ వీడియోను విడుదల చేశారు.

1.13 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో చూస్తుంటే దర్శకుడు ఘోస్ట్‌ను ఎంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడో అర్థమవుతోంది. ముఖ్యంగా సినిమాలో ఉపయోగించిన కత్తులు, తుపాకులను ప్రదర్శించారు. ‘ది ఘోస్ట్‌: గన్స్‌ అండ్‌ స్వార్డ్స్‌’ పేరుతో విడుదల చేసిన ఈ వీడియో సినిమాపై అంచనాలు పెంచేసింది. నాగార్జున, సోనాల్‌ చౌహాన్‌ సినిమాకోసం భారీ కసరత్తులు చేశారు. పూర్తి స్థాయిలో యాక్షన్‌ అండ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాలి.

ఈ చిత్రాన్ని నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్ మెంట్, శ్రీ వెంక‌టేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యాన‌ర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హై ఆక్టేన్ యాక్షన్ ఎంట‌ర్‌టైనర్ గా వ‌స్తున్న ఈ చిత్రంలో గుల్ ప‌నాగ్‌, అనిఖా సురేంద్ర కీ రోల్స్‌ పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మార్క్ కే రాబిన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?