Sai Dharam Tej: మెగాహీరో మంచి మనసు.. ట్వీట్ పై స్పందించి.. చెత్తను క్లీన్ చేయించిన సాయి తేజ్

మెగా మేనల్లుడు సాయి తేజ్(Sai Dharam Tej)హీరోగా ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి విభిన్నమైన కథలతో సినిమాలు ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.

Sai Dharam Tej: మెగాహీరో మంచి మనసు.. ట్వీట్ పై స్పందించి.. చెత్తను క్లీన్ చేయించిన సాయి తేజ్
Sai Tej
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 23, 2022 | 7:22 AM

మెగా మేనల్లుడు సాయి తేజ్(Sai Dharam Tej)హీరోగా ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి విభిన్నమైన కథలతో సినిమాలు ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇటీవలే తేజ్ పెద్ద ప్రమాదం నుంచి బయటపడిన విషయం తెలిసిందే.. బైక్ పై నుంచి వెళ్తూ.. ప్రమాదవశాత్తూ కింద పడిన విషయం తెలిసిందే.. దాంతో సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చాడు. ఇటీవలే తిరిగి సినిమా షూటింగ్స్‌లో జాయిన్ అవుతున్నాడు. ఇక సాయి తేజ్ మంచి మనసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే చాలా గుప్తా దానాలు చేశాడు తేజ్. తాజాగా ఓ నెటిజన్ ట్వీట్ కు స్పందించిన ఈ మెగా హీరో మరోసారి ప్రేక్షకుల మనసును గెలుచుకున్నాడు.

ప్రస్తుతం సాయి తేజ్ కార్తీక్ దండు దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. తేజ్ కెరీర్ లో ఇది 15వ సినిమా. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ ఇటీవలే కుత్బుల్లాపూర్లో హెచ్ ఎంటీ అర్బన్ ఫారెస్ట్రీలో జరిగింది. ఓ క్లిష్టమైన షెడ్యూల్ని ఇక్కడ షూట్ చేసి పూర్తి చేశారు. అయితే షూటింగ్ నేపథ్యంలో ఆ ప్రాంతమంతా చెత్తతో నింపేశారట. సినిమా షూటింగ్ అంటే వందలమంది పని చేస్తారు. కాబట్టి కాస్త చెత్త అవ్వడం జరుగుతుంది. అయితే ఆ ప్రాంతాన్ని చిత్రయూనిట్ శుభ్రం చేయించలేదట.  చిత్రీకరణలో భాగంగా ఆ ప్రాంతమంతా చిందర వందరగా తయారైంది. షూటింగ్ స్పాట్ లో చెత్తా చెదారం వ్యర్ధాలతో అశుభ్రంగా మారిపోయింది.దాంతో ఓ నెటిజన్ ట్విట్టర్ వేదికగా దీనిపై చిత్రయూనిట్ కు సమాచారం అందించాడు. ఆ ట్వీట్ కు జీహెచ్ఎంసీ అధికారులతోపాటు, తేజ్ ను కూడా ట్యాగ్ చేశాడు. ఈ ట్వీట్ పై తేజ్ స్పందిస్తూ.. ఈ విషయాన్ని నా దృష్టికి తెచ్చినందుకు చాలా థ్యాంక్స్. నా టీమ్ దీన్ని చూసుకుంటుంది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటాం అన్నారు. చెప్పినట్టే వెంటనే అక్కడి చెత్తను తొలగించారు. దాంతో తేజ్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!