Bigg Boss 6 Telugu: రెచ్చిపోయిన శ్రీహాన్.. గొడవకు దిగిన ఇనయ.. పిచ్చిదానిలా గంతులేసిన గీతూ..
బిగ్ బాస్ రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతోంది. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ మధ్య గొడవలు పీక్స్ కు చేరుతున్నాయి. బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్‌లతో హౌస్ మేట్స్ మధ్య గొడవలు మరింత ముదురుతున్నాయి.
బిగ్ బాస్(Bigg Boss 6 Telugu)రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతోంది. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ మధ్య గొడవలు పీక్స్ కు చేరుతున్నాయి. బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్‌లతో హౌస్ మేట్స్ మధ్య గొడవలు మరింత ముదురుతున్నాయి. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా శ్రీహాన్, గీతు, ఆదిరెడ్డి, ఫైమా, శ్రీసత్యలు కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపిక అయ్యారు. వీరి మధ్యలో మరో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. పిరమిడ్ కట్టు పడగొట్టు అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ కు రేవంత్ సంచలక్ గా వ్యవహరించారు. అయితే ఈ గేమ్ మొ ముందే గీతూ నేను ఆడాను అంటూ బయటకు వచ్చేసింది. ఆ తర్వాత పిరమిడ్ ను కాపాడుకునే క్రమంలో ఫైమా దాన్ని చేత్తో తాకింది అని పెద్ద రచ్చే చేశాడు రేవంత్. దాంతో ఆమెను డిస్ క్వాలిఫై చేశాడు. ఇక శ్రీహన్ ఇనయ మధ్య ఓ రేంజ్ లో గొడవ జరిగింది.
పిరమిడ్ ను కాపాడుకునే క్రమంలో శ్రీహన్ కూడా బ్రిక్స్ ను చేత్తో టచ్ చేశాడని గొడవకు దిగింది ఇనయ. దాంతో ఇద్దరి మధ్య గట్టిగానే వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో రేవంత్ దగ్గరకు వచ్చి.. శ్రీహన్ ‘ఏ పిట్ట వచ్చి నీ దగ్గర ఏం కూసినా.. సంచాలక్‌గా నీ నిర్ణయం నువ్ తీసుకో’ అని అన్నాడు. దాంతో ఇనయ కోపంతో ఊగిపోయింది. య్ నన్ను పిట్ట అని ఎలా అంటావ్ అంటూ.. శ్రీహాన్‌పై ఫైర్ అయ్యింది. ఇక శ్రీహాన్ కూడా.. ఏయ్ అంటూ వేలు చూపిస్తూ ఇనయ మీదికి దూసుకుని పోయాడు. ఇంతలో మద్యలో గీతూ దూరి పిట్టా అన్నది నిన్ను కాదు నన్ను అంటూ మరింత రెచ్చగొట్టింది. అంతటితో ఆగకుండా వచ్చిందే పాలపిట్ట అంటూ పాటలు పడుతూ.. పిచ్చిదానిలా గెంతులేసింది. ఆ తర్వాత శ్రీహన్ వెంటపడి మరీ నన్ను పిట్టా అని ఎలా అంటావ్.. నిన్ను వాడు అంటే ఒప్పుకోవుగా అంటూ ప్రశ్నించింది ఇనయ. శ్రీహాన్ మాత్రం చెవులు మూసుకుంటూ పరుగులు పెట్టాడు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.