Eastern Railway Jobs 2022: పదో తరగతి/ఇంటర్‌ అర్హతతో తూర్పు రైల్వేలో గ్రూప్‌ సీ, డీ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన కోల్‌కతాలోని తూర్పు రైల్వే.. స్కౌట్స్ అండ్‌ గైడ్స్ కోటాలో గ్రూప్‌-సి, గ్రూప్‌-డి పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు..

Eastern Railway Jobs 2022: పదో తరగతి/ఇంటర్‌ అర్హతతో తూర్పు రైల్వేలో గ్రూప్‌ సీ, డీ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
Indian Railways
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 14, 2022 | 5:20 PM

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన కోల్‌కతాలోని తూర్పు రైల్వే.. స్కౌట్స్ అండ్‌ గైడ్స్ కోటాలో 13 గ్రూప్‌-సి, గ్రూప్‌-డి పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి పదో తరగతి, ఇంటర్మీడియట్‌, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే స్కౌటింగ్/ గైడింగ్‌లో అర్హత ఉండాలి దరఖాస్తుదారుల వయసు గ్రూప్ సి పోస్టులకైతే 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. గ్రూప్ డి పోస్టులకు 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 13, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్‌ అభ్యర్ధులు రూ.500లు, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళా అభ్యర్ధులు రూ.250లు దరఖాస్తు రుసుము చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. డిసెంబర్‌ 17న రాత పరీక్ష నిర్వహిస్తారు. అర్హత సాధించిన వారికి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్లో చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.