TS Inter: ఈ ఏడాది 100 శాతం సిలబస్‌తోనే తెలంగాణ ఇంటర్‌ వార్షిక పరీక్షలు

కొవిడ్‌ మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా 70 శాతం సిలబస్‌తోనే ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు నిర్వహించిన తెలంగాణ ఇంటర్ బోర్డు ఈ ఏడాది మాత్రం పూర్తి సిలబస్‌తో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది..

TS Inter: ఈ ఏడాది 100 శాతం సిలబస్‌తోనే తెలంగాణ ఇంటర్‌ వార్షిక పరీక్షలు
TSBIE
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 14, 2022 | 6:38 PM

కొవిడ్‌ మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా 70 శాతం సిలబస్‌తోనే ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు నిర్వహించిన తెలంగాణ ఇంటర్ బోర్డు ఈ ఏడాది మాత్రం పూర్తి సిలబస్‌తో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. 2022-23 విద్యాసంవత్సరంలో 100 శాతం సిలబస్‌తో ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్‌ బోర్డు సెక్రటరీ నవీన్‌ మిత్తల్‌ శుక్రవారం (అక్టోబర్‌ 14) మీడియాకు తెలిపారు. సిలబస్‌, మోడల్‌ క్వశ్చన్‌ పేపర్లను ఇంటర్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ఆయన వెల్లడించారు. మరోవైపు ఈ విద్యాసంవత్సరంలో నిర్వహించనున్న తెలంగాణ పదో తరగతి పరీక్షలు-2023 గతేడాది మాదిరిగానే ఆరు పేపర్లకే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇదే విధంగా మునుముందు కూడా నిర్వహించే అవకాశం ఉందని సమాచారం.

పీజీఈసెట్‌ 2022 మొదటి విడత కౌన్సెలింగ్‌ పూర్తి

తెలంగాణ పీజీఈసెట్‌ 2022 కౌన్సెలింగ్‌లో ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌ మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తయిందని నవీన్‌ మిత్తల్‌ తెలిపారు. మొత్తం ఎంటెక్ సీట్లు 5,556 ఉండగా, వీటిలో మొదటి విడత 2,522 సీట్లు భర్తీ చేసినట్టు ఆయన తెలిపారు. ఇక 3,106 ఎంఫార్మసీ సీట్లలో మొదటి విడతలో 2,163 సీట్లు భర్తీ చేశామన్నారు. 153 ఎంఆర్క్ సీట్లలో మొదటి విడతలో 46 సీట్లు భర్తీ చేసినట్లు తెలిపారు. కౌన్సెలింగ్‌లో సీట్లు పొందుకున్న విద్యార్ధులు ఆయా కాలేజీల్లో అక్టోబర్‌ 19న రిపోర్టు చేయాలని సూచించారు. ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సులకు అక్టోబర్‌ 24 నుంచి తరగతులు నిర్వహించనున్నట్లు సెక్రటరీ నవీన్‌ మిత్తల్‌ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.