‘నలుగురి కంటే ఎక్కువ మంది పిల్లలున్నారా? ఐతే మీరు ప్రభుత్వ పథకాలకు అనర్హులు’

పెరిగిపోతున్న జనాభాకు అడ్డుకట్ట వేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. ఒక కుటుంబంలో నలుగురి కంటే ఎక్కువ సంతానం ఉంటే వారికి ప్రభుత్వ ప్రయోజనాలేమీ వర్తించకుండా నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది. మణిపూర్‌లో నలుగురు పిల్లల కంటే ఎక్కువ ఉన్న కుటుంబాలకు ప్రభుత్వ ప్రయోజనాలను నిలిపివేస్తున్నట్లు..

'నలుగురి కంటే ఎక్కువ మంది పిల్లలున్నారా? ఐతే మీరు ప్రభుత్వ పథకాలకు అనర్హులు'
No Government Benefits For these Families
Follow us

|

Updated on: Oct 14, 2022 | 9:20 PM

పెరిగిపోతున్న జనాభాకు అడ్డుకట్ట వేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. ఒక కుటుంబంలో నలుగురి కంటే ఎక్కువ సంతానం ఉంటే వారికి ప్రభుత్వ ప్రయోజనాలేమీ వర్తించకుండా నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది. మణిపూర్‌లో నలుగురు పిల్లల కంటే ఎక్కువ ఉన్న కుటుంబాలకు ప్రభుత్వ ప్రయోజనాలను నిలిపివేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం గురువారం (అక్టోబర్‌ 14) ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ఆధ్వర్యంలోని రాష్ట్ర క్యాబినెట్‌ మణిపూర్ స్టేట్ పాపులేషన్ కమిషన్ ఏర్పాటుకు ఆమోదించింది. ఈ కమిషన్‌ అమల్లోకి వచ్చిన తర్వాత నలుగురు కంటే ఎక్కువ మంది పిల్లలున్న కుటుంబాలకు ఎటువంటి ప్రభుత్వ ప్రయోజనాలు లభించవు. కాగా జనాభా కమిషన్‌ను ఏర్పాటు చేయాలని గతంలో రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెల్పింది.

2011 జనాభా లెక్కల ప్రకారం.. మణిపూర్ జనాభా 28.56 లక్షలు. 2001లో ఆ సంఖ్య 22.93 లక్షలగా ఉంది. రాష్ట్రంలోకి బయటి వ్యక్తుల చొరబాటు ఆరోపణలపై బీజేపీ ఎమ్మెల్యే ఖుముక్చమ్ జోయ్‌కిసాన్ అసెంబ్లీ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో అధికారిక డేటాను ఉటంకిస్తూ.. 1971 నుంచి 2001 సంవత్సరాల మధ్యకాలంలో మణిపూర్‌ జనాభా పెరుగుదల153.3% ఉంది. 2001 నుంచి 2011 మధ్యకాలంలో 250%కి భారీగా జనభా పెరిగిందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

పొరుగు రాష్ట్రమైన అస్సాంలో కూడా ఇదే విధమైన ఆంక్షలు ఉన్నాయి. జనవరి 1, 2021 లేదా ఆ తర్వాత ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది భాగస్వాముల ద్వారా ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ సంతానం ఉన్న వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండు రాష్ట్రాల మాదిరిగానే మిగతా రాష్ట్రాలు కూడా జనాభా నియంత్రణకు ఇదే తరహాలో ఆంక్షలు తీసుకొస్తారేమోనని ప్రజలు బెంబేలెత్తపోతున్నారు.