AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket: అభిమాన క్రికెటర్ ను దుర్భాషలాడాడని.. బ్యాటుతో కొట్టి చంపేశాడు.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న ఫ్యాన్స్..

భారతదేశంలో క్రికెట్ ను అభిమానించే వారి సంఖ్య కోట్లల్లో ఉంటుంది. టీమ్ గురించి మాత్రమే కాకుండా.. ప్లేయర్ల పట్ల కూడా అభిమానం పెంచుకుంటారు. అభిమాన ఆటగాడి గురించి ఎవరు తక్కువగా మాట్లాడినా అస్సలు..

Cricket: అభిమాన క్రికెటర్ ను దుర్భాషలాడాడని.. బ్యాటుతో కొట్టి చంపేశాడు.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న ఫ్యాన్స్..
Crime News
Ganesh Mudavath
|

Updated on: Oct 15, 2022 | 6:28 AM

Share

భారతదేశంలో క్రికెట్ ను అభిమానించే వారి సంఖ్య కోట్లల్లో ఉంటుంది. టీమ్ గురించి మాత్రమే కాకుండా.. ప్లేయర్ల పట్ల కూడా అభిమానం పెంచుకుంటారు. అభిమాన ఆటగాడి గురించి ఎవరు తక్కువగా మాట్లాడినా అస్సలు ఊరుకోరు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ వచ్చినప్పటి నుంచి ఈ అభిమానం మరింతగా పెరిగింది. ప్రస్తుతం ఇంటర్నెట్ వేదికగా రోహిత్ శర్మ , విరాట్ కోహ్లి అభిమానులు గొడవ పడుతున్నారు. ఎవరు బెటర్ ప్లేయర్ అనే చర్చ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తమిళనాడులోని అరియలూరు జిల్లా పొయ్యూరు గ్రామంలో విఘ్నేష్, ధర్మరాజ్ మధ్య వివాదం జరిగింది. వారిద్దరూ స్నేహితులు. వారికి క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. అక్టోబర్ 11వ తేదీ రాత్రి వీరిద్దరి మధ్య మల్లూరులోని సిడ్కో ఇండస్ట్రియల్ ఏరియాలో క్రికెట్‌పై చర్చ జరిగింది.

ఇద్దరూ మద్యం సేవించి ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గురించి మాట్లాడుకున్నారు. ఆ సమయంలో విఘ్నేష్ ఆర్సీబీ, విరాట్ కోహ్లీ గురించి తక్కువగా మాట్లాడారు. దీంతో కోపోద్రిక్తుడైన ధర్మరాజ్ మొదట విఘ్నేష్ తలపై బాటిల్ తో కొట్టాడు. అనంతరం బ్యాట్‌తో తీవ్రంగా బాదాడు. ఈ ఘటనలో విఘ్నేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో తీవ్ర భాయాందోళనకు గురైన ధర్మరాజు వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ధర్మరాజును అదుపులోకి తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రస్తుత కాలంలో భారత క్రికెట్‌లోనే కాకుండా ప్రపంచ క్రికెట్‌లోనూ టాప్ ప్లేయర్లుగా ఉన్నారు. వీరిద్దరూ ఐపీఎల్‌లో కూడా తమ తమ ఫ్రాంచైజీలకు కెప్టెన్లుగా ఉన్నారు. రోహిత్ కెప్టెన్సీలో ముంబై 5 సార్లు టైటిల్ గెలుచుకుంది, విరాట్ కెప్టెన్సీలో బెంగళూరు ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయింది. దీని కారణంగా తరచుగా రెండు జట్ల అభిమానుల మధ్య సోషల్ మీడియాలో చాలా గొడవ జరుగుతోంది.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!