AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh Crime: ఒంగోలులో దారుణం! వివాహితను బైక్‌తో ఢీకొట్టి.. ఆపై గ్యాంగ్‌ రేప్‌..

కూరగాయల వ్యాపారం చేసుకునే వివాహితపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. వ్యాపారం నిమిత్తం నగరానికి వచ్చి, తిరిగి ద్విచక్ర వాహనంపై బుధవారం రాత్రి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..

Andhra Pradesh Crime: ఒంగోలులో దారుణం! వివాహితను బైక్‌తో ఢీకొట్టి.. ఆపై గ్యాంగ్‌ రేప్‌..
Representative image
Srilakshmi C
|

Updated on: Oct 14, 2022 | 9:55 PM

Share

కూరగాయల వ్యాపారం చేసుకునే వివాహితపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. వ్యాపారం నిమిత్తం నగరానికి వచ్చి, తిరిగి ద్విచక్ర వాహనంపై బుధవారం రాత్రి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ఇద్దరు యువకులు అడ్డగించి అగాయిత్యానికి పాల్ప అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఒంగోలులోని కొప్పోలు-ఆలూరు రహదారిపై బుధవారం రాత్రి జరగగా, గురువారం వెలుగు చూసింది.

కొత్తపట్నం మండలం ఆలూరు గ్రామానికి చెందిన వివాహిత (30) ఒంగోలు నగరంలో కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేది. ఈ క్రమంలో బుధవారం రాత్రి వ్యాపారం ముగించుకుని 10 గంటల30 నిముషాల ప్రాంతంలో స్కూటీపై ఇంటికి వెళ్తోంది. ఐతే మార్గం మధ్యలో మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై ఆమెను వెంబడిచారు. కొప్పోలు-గుత్తికొండవారిపాలెం రహదారిపై గుత్తికొండవారిపాలెం దాటిన తర్వాత నిర్మానుష్య ప్రదేశంలో ఆమె వాహనాన్ని ఢీ కొని, చీకట్లో పొలంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఐతే ఇంటి వద్ద ఆమె కోసం ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులు ఎంతకీ రాకపోవడంతో ఆందోళన చెందారు. అనంతరం ఆమెను వెతుక్కుంటూ బయల్దేరగా.. మార్గం మధ్యలో తారసపడగా ఆమెపై ఇద్దరు వ్యక్తులు దాడి చేసిన సంగతి కుటుంబ సభ్యులకు తెల్పింది. దీంతో నిందితులును వెతుక్కుంటూ బయల్దేరిన బాధితురాలి బంధువులకు కొత్తపట్నం రోడ్డులోని ఓపెట్రోల్‌బంకు సమీపంలో కనిపించారు. వారిని పట్టుకునేలోపు పరారయ్యారు.

ఇవి కూడా చదవండి

ఈ ఘటనపై బాధితురాలు ఒంగోలు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు గురువారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని హింసకు పాల్పడిన వారిని పట్టుకునేందుకు ఎస్పీ మలికా గార్గ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్పెషల్‌ పోలీస్‌ టీం నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆలూరు రోడ్డు వద్ద ఉన్న రొయ్యల చెరువుల వద్ద పనిచేస్తున్న యువకులు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసును ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ నుంచి ఒంగోలు దిశ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసి తదుపరి దర్యాప్తు చేపట్టారు.

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..