Bihar: స్కూటీపై హెల్మెట్ లేకుండా వెళ్తోన్న యువకులు .. వెంబడించి స్కూటర్ నుంచి వారిని కిందకి పడేసిన పోలీసులు

వైరల్ అవుతున్న వీడియోలో.. ఇద్దరు యువకులు స్కూటీపై వెళ్తున్నారు.  ఆ యువకులు హెల్మెట్ పెట్టుకోకపోవడంతో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.. అయితే తమవైపు వస్తున్న పోలీసులను చూసి..

Bihar: స్కూటీపై హెల్మెట్ లేకుండా వెళ్తోన్న యువకులు .. వెంబడించి స్కూటర్ నుంచి వారిని కిందకి పడేసిన పోలీసులు
Bihar Police Constable
Follow us
Surya Kala

|

Updated on: Oct 15, 2022 | 1:31 PM

మన దేశంలో చట్టం అందరికీ సమానం..  అది సామాన్యుడికైనా, చట్టాన్ని కాపాడే వారికైనా సరే చట్టం అందరికీ ఒకటే.. అయితే, చాలాసార్లు అధికారులు తమ పదవులను దుర్వినియోగం చేసి పనులు చేయడం చాలాసార్లు కనిపిస్తుంది. ఈ విషయానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం జనాల్లో చర్చనీయాంశమైంది. అక్కడ ఇద్దరు వ్యక్తులు హెల్మెట్ ధరించకపోవడంతో నలుగురు ట్రాఫిక్ పోలీసు కానిస్టేబుళ్లు కదులుతున్న స్కూటీపై ఇద్దరు వ్యక్తులను తోసేశారు. బీహార్‌లోని జాముయ్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇది బీహార్ శాంతిభద్రతలపై అనేక ప్రశ్నలను లేవనెత్తింది. వీడియో వైరల్ అయిన తర్వాత.. పోలీసులు చేసిన పని చట్టానికి లోబడి ఉందా అని ప్రజలు బీహార్ పోలీసులను ప్రశ్నిస్తున్నారు.

ఇక్కడ వీడియో చూడండి:

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియోలో.. ఇద్దరు యువకులు స్కూటీపై వెళ్తున్నారు.  ఆ యువకులు హెల్మెట్ పెట్టుకోకపోవడంతో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.. అయితే తమవైపు వస్తున్న పోలీసులను చూసి ఆ ఇద్దరు యువకులు స్కూటీ స్పీడ్ పెంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. కానిస్టేబుల్ వారిని ఆపడానికి తన వంతు ప్రయత్నం చేశాడు. వారి వెంట పరుగెత్తడం ప్రారంభించాడు. ఇంతలో.. మరొక కానిస్టేబుల్ స్పందించి స్కూటీ పై వెళ్తోన్న ఇద్దరు రైడర్లను కదులుతున్న స్కూటీ నుండి తోసేశాడు. దీంతో ఇద్దరూ రోడ్డు మీద పడ్డారు.

ఈ వీడియోను @IamSuVidha అనే ఖాతా ద్వారా ట్విట్టర్‌లో షేర్ చేశారు. పోలీసులు ఈ విధంగా శిక్షించాలా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియో చూసి కొంత మంది పోలీసుల నిర్వాకాన్ని ఖండిస్తూంటే.. పలువురు యువకుల తీరుని తప్పుపడుతున్నారు. హెల్మెట్ ధరించనందుకు.. కొన్ని నిబంధనలు రూపొందించారని.. ఇలాంటి చర్యలు తీసుకోవడానికి పోలీసులకు ఎవరు అనుమతి ఇచ్చారని కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..