Goa: కుప్పకూలిన దూద్‌సాగర్ కేబుల్ బ్రిడ్జి..! తృటిలో తప్పించుకున్న 40 మంది ప్రయాణికులు..
భారీ వర్షాల కారణంగా శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. వంతెన కూలిపోవడంతో, 40 మంది సందర్శకులు చిక్కుకుపోయారు. వర్షాకాలం ప్రారంభంలో ఈ జలపాతం సందర్శన నిలిపివేయబడింది.
ఎప్పుడూ పర్యాటకుల రద్దీతో ఉండే గోవాలో పెను ప్రమాదం తప్పింది. భారీ వర్షాల కారణంగా దూద్ సాగర్ జలపాతం వద్ద కేబుల్ బ్రిడ్జి తెగిపోయింది. 40మందికిపైగా పర్యాటకులను అధికారులు, అక్కడున్న సిబ్బంది రక్షించారు. ఈ ఘటన శుక్రవారం జరిగింది. భారీ వర్షాల కారణంగా అకస్మాత్తుగా నీటి మట్టం పెరగడంతో మండోవి నదిపై ఉన్న కేబుల్ వంతెన కొట్టుకుపోయింది. గోవా-కర్ణాటక సరిహద్దులో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. వంతెన కూలిపోవడంతో, 40 మంది సందర్శకులు చిక్కుకుపోయారు. వారిని దృష్టి లైఫ్‌సేవర్స్ సహాయం ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వంతెన లేకపోవడంతో సందర్శకులు తమంతట తాముగా ప్రవహించే నీటిలో నదిని దాటలేకపోయారు. ఆ తర్వాత రాష్ట్రం నియమించిన లైఫ్‌గార్డ్‌లు వారిని అక్కడ్నుంచి ఖాళీ చేయించారు.
నదిలో ఒక్కసారిగా నీటిమట్టం పెరగడం వల్ల క్రాసింగ్ కోసం ఉపయోగించిన వంతెన కూలిపోయింది. దాంతో 40 మందికి పైగా పర్యాటకులు చిక్కుకుపోయారు. దృష్టి లైఫ్‌గార్డుల ద్వారా వెంటనే జలపాతం వద్ద లైఫ్‌సేవర్స్ సహాయం అందించారు. దీంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. భారీ వర్షాలు, నీటిమట్టం పెరగడంతో రానున్న కొద్దిరోజుల పాటు దూద్‌సాగర్ జలపాతం సందర్శనకు పర్యాటకులు, స్థానిక ప్రజలు ఎవరూ వెళ్లకూడదని దృష్టి లైఫ్‌సేవర్స్ హెచ్చరించింది. ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసినవారంతా పర్యాటకులను రక్షించినందుకు రివర్ లైఫ్‌సేవర్స్‌కు ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నారు.
Today evening due to heavy rain at Karnataka water level at Dudhsagar waterfall increase due to this crossing bridge got turn. around 40 Guest stuck and unable to cross River Lifesaver went on bridge and help one by one to cross bridge pic.twitter.com/TutWgQFci8
— Dev walavalkar (@walavalkar) October 14, 2022
గోవా-కర్ణాటక సరిహద్దులో ఉన్న సుందరమైన దూద్‌సాగర్ జలపాతం పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తుంది. వర్షాకాలం ప్రారంభంలో ఈ జలపాతం సందర్శన నిలిపివేయబడింది. కానీ ఈ వారం ప్రారంభంలో పర్యాటకుల కోసం తెరవబడింది. ఇదిలావుండగా, అక్టోబర్ 14 నుండి అక్టోబర్ 17 వరకు కర్నాటకలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది. కర్నాటక సీఎం బొమ్మై ప్రకారం, అక్టోబరు ప్రారంభం నుండి వర్షాలతో దెబ్బతిన్న కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో 13 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. పశువులు, ఆస్తులకు పెద్ద ఎత్తున విధ్వంసం సంభవించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి