Delhi: గర్ల్ ఫ్రెండ్ తో షాపింగ్ కు వెళ్లి భార్యకు అడ్డంగా దొరికిపోయిన భర్త.. ఇద్దరినీ దంచికొట్టిన భార్య

ఆ మహిళ భర్త.. తన గర్ల్​ఫ్రెండ్​తో కలిసి ఢిల్లీలోని ఘాజియాబాద్​ మార్కెట్​కు వెళ్లాడు. ఇద్దరు కలిసి షాపింగ్​ చేశారు. సంతోషంగా గడిపారు. అయితే వీరి ఆనందం ఎంతో సేపు నిలవలేదు. కొద్దిసేపటికే కథ మారిపోయింది. 

Delhi: గర్ల్ ఫ్రెండ్ తో షాపింగ్ కు వెళ్లి భార్యకు అడ్డంగా దొరికిపోయిన భర్త.. ఇద్దరినీ దంచికొట్టిన భార్య
Man Shopping With Girlfrien
Follow us
Surya Kala

|

Updated on: Oct 14, 2022 | 9:10 AM

ఉత్తర భారత దేశంలో కర్వా చౌత్​ ప్రసిద్ధి చెందిన పండుగ. మహిళలు తమ భర్తల దీర్ఘాయుస్సుకోసం కుటుంబ సుఖ సంతోషాలతో చేసే పండగ. ఈ పర్వదినం రోజున మహిళలు.. ఉదయం నుంచి ఉపవాసం ఉండి, పూజలు చేసిన తర్వాత రాత్రికే భోజనం చేస్తారు. అయితే ఈ కర్వా చౌత్​ సందర్భంగా.. ఢిల్లీలో గురువారం ఓ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. గర్ల్​ఫ్రెండ్​తో షాపింగ్​ వెళ్లిన ఓ వ్యక్తి.. తన భార్యకు అడ్డంగా దొరికిపోయాడు. భర్త చేసిన పని..భార్య కంటపడింది.. అంతే.. ఆ భార్య, నడి రోడ్డు మీద ఇద్దరిపై దాడి చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. ఢిల్లీలోని ఘాజియాబాద్​ మార్కెట్​లో చోటు చేసుకుంది ఈ ఘటన. వివరాల్లోకి వెళ్తే..

కొన్ని రోజుల క్రితం, ఓ మహిళకు తన భర్తతో గొడవపడింది. దీంతో ఆమె అలిగి.. అదే ఊర్లో ఉన్న తన పుట్టింటికి వెళ్ళింది. అయితే గురువారం ఆ మహిళ భర్త.. తన గర్ల్​ఫ్రెండ్​తో కలిసి ఘాజియాబాద్​ మార్కెట్​కు వెళ్లాడు. ఇద్దరు కలిసి షాపింగ్​ చేసి.. సంతోషంగా గడిపారు. అయితే వీరి ఆనందం ఎంతో సేపు నిలవలేదు. కొద్దిసేపటికే సీన్ మొత్తం రివర్స్ అయింది..

ఇవి కూడా చదవండి

భర్త గర్ల్ ఫ్రెండ్ షాపింగ్ కు వెళ్లిన ఆ మార్కెట్​కు అదే సమయంలో తన తల్లి, స్నేహితులతో కలిసి వెళ్లింది ఆ వ్యక్తి భార్య. భర్త, అతని గర్ల్​ఫ్రెండ్​ షాపింగ్​ చేస్తుండటం చూసి షాక్​కు గురైంది. అంతే..  భర్తపై దాడి చేసింది. భార్య తన స్నేహితులతో కలిసి భర్త కాలర్ పట్టుకుని కొట్టింది. ఇందుకు ఆమె తల్లి కూడా సహకరించింది. సినిమాలోని సన్నివేశంలా ఉన్న సంఘటనను స్థానికులు తమ కెమెరాల్లో బంధించారు. అదే సమయంలో.. ఆ గర్ల్​ఫ్రెండ్​ అడ్డుకునేందుకు ప్రయత్నించింది. ఫలితంగా ఆమె కూడా ఆ మహిళ చేతుల్లో దెబ్బలు తినాల్సి వచ్చింది.

భర్తను కొడుతున్న భార్య 

అయితే తన షాప్ ముందు జరిగిన ఈ గొడవ పై అసంతృప్తి వ్యక్తం చేశాడు యజమాని. ‘బయటకు వెళ్లి కొట్టుకోండి,’ అంటూ పదేపదే అరిచాడు. తన భర్త, అతని గర్ల్ ఫ్రెండ్ పై ఆ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భర్త చేసిన పనిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ‘కర్వా చౌత్​ రోజే దొరికిపోయావా?’ అంటూ కొందరు కామెంట్ చేయగా..  ఇలాంటి పనులు చేసే వ్యక్తికీ తగిన బుద్ధి చెప్పాలి,’ అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..