Sarpanch Election: గ్రామంలో 3 ఎయిర్ పోర్ట్స్, రూ. 20కే పెట్రోల్, ఒక్కొక్కరి ఒక్కో బైక్’.. ఐపీఎస్ అధికారి ట్వీట్ వైరల్.. ఇంతకీ విషయమేంటంటే..
ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత గ్రామంలో మూడు విమానాశ్రయాలు నిర్మిస్తామని, మహిళలకు మేకప్ కిట్ ఉచితంగా ఇస్తామని, లీటర్ పెట్రోల్ రూ.20కి, ఒక్కొక్కరికి ఒక్కో బైక్ ఇస్తామని ప్రకటించాడు.
ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు పడే ఆరాటం .. ఓటర్లను ఆకట్టుకోవడానికి వారు చేసే పోరాటం గురించి ఎంత చెప్పినా తక్కువే. అవును పంచాయితీ ఎన్నికలైనా, పార్లమెంట్ ఎన్నికలైనా పోటీ పడే అభ్యర్థులు గెలుపుని సొంతం చేసుకోవాలని భావిస్తారు. అందుకు తమకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు.. అయితే పంచాయితీ వంటి చిన్న ఎన్నికల్లో బరిలో దిగే అభ్యర్థుల్లో ఎవరికీ తమ ఓటు వెయ్యాలో తెలియని సందర్భాలను ఎదుర్కొంటారు కొందరు. ఎందుకంటే పంచాయతీ ఎన్నికల బరిలోకి చాలా మంది అభ్యర్థులు దిగుతూ ఉంటారు. ఈ సందర్భంగా చాలా మంది అభ్యర్థులు రకరకాల వాగ్దానాలు చేస్తుంటారు. చాలా మంది అభ్యర్థులు ఎన్నికల్లో గెలుపొందడానికి రకరకాల వాగ్దానాలు చేసినా.. గెలిచిన తర్వాత వాటిని నెరవేర్చడానికి ప్రయత్నిస్తారు. కొన్ని సార్లు సక్సెస్ కాదు. అలాంటి ఒక అభ్యర్థి వాగ్దానాల వింత జాబితా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ఇది చూసిన తర్వాత మీరు కూడా ఆలోచిస్తారు.
వాస్తవానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టర్ ప్రకారం, సిర్సాద్ గ్రామం నుండి సర్పంచ్ పదవికి కాబోయే అభ్యర్థి భాయి జైకరన్ లాత్వాల్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత తాను ఈ హామీలను నెరవేరుస్తా అంటూ సుదీర్ఘ జాబితాను పంచుకున్నారు. అందులో మొత్తం 13 వాగ్దానాలు చేయబడ్డాయి. దాదాపు ఈ వాగ్దానాలను చూస్తే ఎవరైనా ఆలోచించాల్సిందే.
అభ్యర్థి ఎన్ని హామీలు ఇచ్చాడో చూడండి?
Am shifting to this village ? pic.twitter.com/fsfrjxbdLc
— Arun Bothra ?? (@arunbothra) October 9, 2022
ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత గ్రామంలో మూడు విమానాశ్రయాలు నిర్మిస్తామని, మహిళలకు మేకప్ కిట్ ఉచితంగా ఇస్తామని, లీటర్ పెట్రోల్ రూ.20కి, ఒక్కొక్కరికి ఒక్కో బైక్ ఇస్తామని ప్రకటించాడు. అంతేకాదు గ్రామంలోని కుటుంబానికి ఉచితంగా, మాదకద్రవ్యాలకు బానిసలైన వారికి రోజుకు ఒక సీసా మద్యం లభిస్తుందని పేర్కొన్నాడు. సిర్సాద్ నుండి గోవా వరకు ప్రతి 5 నిమిషాలకు హెలికాప్టర్ సౌకర్యం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.
అంతేకాదు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి ఇలాంటి ఫన్నీ ఎన్నికల వాగ్దానాలు మరిన్ని చేశాడు. GST రద్దు చేస్తామని.. గ్యాస్ ధర సిలిండర్‌కు రూ 100, సిర్సాద్ నుండి ఢిల్లీ వరకు మెట్రో లైన్, ఉచిత Wi-Fi సౌకర్యం, యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు వంటి వాగ్దానాలు ఉన్నాయి.
ఈ వింత వాగ్దానాలతో కూడిన పోస్టర్‌ను ఐపీఎస్ అధికారి అరుణ్ బోత్రా తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. క్యాప్షన్‌లో ‘నేను ఈ గ్రామానికి మారుతున్నాను’ అని సరదాగా రాశారు. యూజర్లు కూడా ఈ పోస్టర్‌ని చూసి చాలా సంతోషిస్తున్నారు. ‘పోటీ లేకుండానే ఎన్నుకోవాలి’ అని కొందరంటే, ‘ఎక్కువ పోటీ వుండాలి, అప్పుడే ఇంత పెద్ద వాగ్దానాలు చేస్తారు’ అని మరికొందరు అంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వైరల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..