కిచెన్‌లో మరమ్మత్తులు చేస్తుండగా దొరికిన లోహపు డబ్బా.. తీరా ఓపెన్ చేసి చూస్తే కళ్లు జిగేల్..
ఓ జంటకు అనుకోని అదృష్టం తలుపు తట్టింది. కిచెన్‌లో మరమ్మత్తులు చేస్తుండగా ఓ లోహపు డబ్బా కనిపించింది.

ఓ జంటకు అనుకోని అదృష్టం తలుపు తట్టింది. కిచెన్‌లో మరమ్మత్తులు చేస్తుండగా ఓ లోహపు డబ్బా కనిపించింది. ఇక అందులో ఏముందా అని ఓపెన్ చేయగా.. 264 బంగారు నాణేలు దర్శనమిచ్చాయి. వాటి విలువ 2 లక్షల 50 వేల పౌండ్లు(సుమారు రూ. 2.3 కోట్లు) ఉంటుందని అంచనా. ఈ ఘటన బ్రిటన్‌లో చోటు చేసుకుంది. ఇంతకీ ఆ స్టోరీ ఏంటో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే..
ఇదొక ఇంటరెస్టింగ్ న్యూస్.. బ్రిటన్‌లోని నార్త్ యార్క్‌షైర్‌లో నివాసం ఉంటున్న ఓ జంట తమ కిచెన్‌ను రినోవేట్ చేస్తుండగా.. ఓ లోహపు డబ్బా కనిపించింది. అందులో వారికి 400 ఏళ్ల నాటి 264 బంగారు నాణేలు కనిపించాయి. ఈ ఘటన జరిగింది 2019వ సంవత్సరంలో కాగా.. ఆ జంట నాణేలను వేలం వేయడంతో.. అవి వాటి అంచనా విలువ కంటే దాదాపు మూడు రెట్లు పలికాయి. ఆక్షన్‌లో సుమారు రూ. 6.8 కోట్లకు అమ్ముడుపోయాయి.
ఆ జంటకు బంగారు నాణేల డబ్బా.. వంటగదిలోని ఫ్లోర్‌బోర్డ్‌ల సెట్ కింద లభించింది. సుమారు 6 అంగుళాల కాంక్రీట్ కింద ఆ లోహపు డబ్బా పాతిపెట్టినట్లు గుర్తించారు. 10 సంవత్సరాలుగా ఆ ఇంట్లో నివసిస్తున్నా.. ఈ బంగారు నాణేల గురించి తమకు ఎలాంటి సమాచారం తెలియదని ఆ జంట చెబుతోంది. మరోవైపు ఈ బంగారు నాణేలను వేలం వేసిన నిర్వాహకులు.. 1700 సంవత్సరానికి చెందిన ఒక సంపన్న వ్యాపారి అయిన ఫెర్న్లీ- మాస్టర్స్‌కు చెందినవని పేర్కొన్నారు.
