Amul Milk Price: పండగల వేళ మళ్ళీ పాల ధరలకు రెక్కలు.. అమూల్ పాల ధర పెంపు.. కొత్త రేట్లు తెలుసుకోండి
ప్రస్తుతం అమూల్ ధరల పెరుగుదల ఊహించనిది. తెల్లవారుజామున నుంచే పెంచిన ధరలు అమల్లోకి వచ్చాయి. అయితే దీనిపై గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
పండుగల సీజన్‌లో సామాన్యులకు ద్రవ్యోల్బణంతో మరో షాక్ తగిలింది. దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో పాల ధరలను అమూల్ రూ.2 పెంచింది. ఇప్పుడు ఢిల్లీలో లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ ధర రూ.63కి చేరుకుంది. అంతకుముందు ఆగస్టులో కూడా పాల ధరలను పెంచారు. నిన్న విడుదల చేసిన ద్రవ్యోల్బణం గణాంకాల ప్రకారం.. పశుగ్రాసం ద్రవ్యోల్బణం 9 సంవత్సరాల తర్వాత 25 శాతానికి పైగా రికార్డు స్థాయికి చేరుకుంది. దీంతో పాల ఉత్పత్తి ఖర్చులు భారీగా పెరిగాయి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అమూల్ కంపెనీ తమ పాల ధరలను పెంచుతోంది.
అయితే ప్రస్తుతం అమూల్ ధరల పెరుగుదల ఊహించనిది. తెల్లవారుజామున నుంచే పెంచిన ధరలు అమల్లోకి వచ్చాయి. అయితే దీనిపై గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ప్రస్తుతం మార్కెట్‌లో ఫుల్ క్రీమ్ మిల్క్ ధర రూ.2 పెరగడంతో కొత్త ధరలు లీటరుకు రూ.61 నుంచి రూ.63కి చేరుకుంది. అంతకుముందు ఆగస్టులో అమూల్, మదర్ డెయిరీ పాలపై లీటరుకు రూ.2 చొప్పున పెంచాయి. అదే సమయంలో, మార్చిలో కూడా పాల ధరలను పెంచారు. రైతుల పాల ఉత్పత్తి వ్యయం నిరంతరం పెరుగుతోందని, దీంతో వారి ఆదాయం తగ్గిపోయిందని గత రెండు సార్లు సమాఖ్య తెలిపింది. రైతులకు ఊరటనిచ్చేందుకే పాల ధరలను పెంచారు.
ఖరీదైన పశుగ్రాసం: పాల ధరకు ప్రధాన కారణం పశుగ్రాసం ఖర్చు. శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం సెప్టెంబర్ నెలలో ద్రవ్యోల్బణం 25.23 శాతంగా ఉంది. గతేడాది ఇదే నెలలో ఇది 20.57 శాతంగా ఉంది. ఆగస్టు నెలలో, పశుగ్రాసం ద్రవ్యోల్బణం రేటు 25.54 శాతానికి చేరుకుంది. ఇది 9 సంవత్సరాల గరిష్ట స్థాయి. సెప్టెంబరులో ఉపశమనం లభించింది. అయితే ధరలు ఇప్పటికీ ఆందోళనకర స్థాయిలో ఉన్నాయి. పశుగ్రాసం ద్రవ్యోల్బణం రేటు టోకు ద్రవ్యోల్బణం రేటు కంటే రెట్టింపు స్థాయిలోనే ఉంది. శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. టోకు ద్రవ్యోల్బణం గత నెలలో 12.41 శాతం నుండి సెప్టెంబర్ నెలలో 10.7 శాతానికి తగ్గింది. మరోవైపు టోకు ధరల ఆధారంగా ఆహార ద్రవ్యోల్బణం 9.93 శాతం నుంచి 8.08 శాతానికి తగ్గింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..