AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Food Day: మనదేశంలో రోజూ ఆకలితో అలమటిస్తున్న 19 కోట్లమంది.. ఏడాదికి 92 వేల కోట్ల ఆహారం వృథా..

మనం మన భారతదేశం గురించి మాట్లాడితే.. ఇక్కడ ప్రతిరోజూ 19 కోట్ల మంది ప్రజలు ఆకలితోనే అలమటిస్తూ నిద్రపోతున్నారు. మరోవైపు కొన్ని లెక్క ప్రకారం, 40 శాతం ఆహారోత్పత్తి వృధా అవుతోంది. అంటే దాదాపు 92 వేల కోట్ల రూపాయల ఆహారం వృధా అవుతుంది.

World Food Day: మనదేశంలో రోజూ ఆకలితో అలమటిస్తున్న 19 కోట్లమంది.. ఏడాదికి 92 వేల కోట్ల ఆహారం వృథా..
World Food Day
Surya Kala
|

Updated on: Oct 16, 2022 | 7:23 PM

Share

ఆహారం వృధా అనేది తీవ్రమైన సమస్య. అది కూడా ప్రపంచంలో 83 కోట్ల మంది ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే.. మరోవైపు ఆహారం వృధా చేస్తూనే ఉన్నారు. అయితే ఆహారం వృధా చేయడాన్ని అరికడితే.. ఆకలితో అల్లాడుతున్న బాధితులకు ఎంతమందికి ఆహారం అందించవచ్చు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆహారం వృధా చేసే విషయంలో భారతదేశం ప్రపంచంలో రెండవ స్థానంలో ఉంది. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రాం (UNEP) నివేదిక ప్రకారం.. చైనాలో, భారతదేశంలో సంవత్సరానికి సుమారు 687 మిలియన్ టన్నుల ఆహారం వృధా అవుతుందని తెలుస్తోంది.

ఈ సంఖ్యను నియంత్రించినట్లయితే, దేశం ఒకేసారి మూడు విజయాలు సాధించగలదు.

1* ప్రపంచ ఆకలిని తగ్గించడం భారతదేశంతో సహా అనేక అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందిన దేశాల్లో ఆహార వృధా ఒక పెద్ద సమస్యగా మారింది. ప్రపంచవ్యాప్తంగా 83 కోట్ల మంది ప్రజలు ప్రతిరోజూ ఆకలితో అలమటిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో, ఆహారం వృధా చేయడం పెద్ద సమస్య, మనం మన భారతదేశం గురించి మాట్లాడితే.. ఇక్కడ ప్రతిరోజూ 19 కోట్ల మంది ప్రజలు ఆకలితోనే అలమటిస్తూ నిద్రపోతున్నారు. మరోవైపు కొన్ని లెక్క ప్రకారం, 40 శాతం ఆహారోత్పత్తి వృధా అవుతోంది. అంటే దాదాపు 92 వేల కోట్ల రూపాయల ఆహారం వృధా అవుతుంది. దీనిని అరికట్టినట్లయితే.. ప్రజలు ఆహారాన్ని వృధా చేయకూడదని ప్రతిజ్ఞ చేస్తే..  అప్పుడు ప్రపంచ ఆకలి గణాంకాలను తగ్గించవచ్చు, ఇది మొదటి విజయం అవుతుంది.

ఇవి కూడా చదవండి

2* ఆహార వస్తువుల ధరల్లో స్థిరత్వం కాలంతో పాటు ద్రవ్యోల్బణం పెరుగుతోంది. కూరగాయల నుండి ఆహారధాన్యాల ధరలు పెరుగుతున్నాయి. అయితే ఇలా ఎందుకు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? UNEP డేటా ప్రకారం.. ఆహారాన్ని వృధా చేయడంలో భారతదేశం ప్రపంచంలో రెండవ స్థానంలో ఉంది. ఈ వృధాను అరికట్టినట్లయితే.. అప్పుడు ఆకలి సంఖ్య తగ్గుతుంది. ఆహార పదార్థాల ధరల పెరుగుదలను కూడా అరికట్టవచ్చు.

3*వాతావరణ మార్పు   ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం నివేదిక ప్రకారం.. ఆహారాన్ని వృధా చేయడంలో చైనా అగ్రస్థానంలో ఉంది. ఆ దేశంలో ఏడాదికి 96 మిలియన్ టన్నుల ఆహారం వృధా చేస్తున్నారు. భారతదేశంలో 68 మిలియన్ టన్నులు, ఆహారం వృధా అయితే అమెరికాలో 193 మిలియన్ టన్నులు. అహారం వృధా తక్కువ అయితే.. అప్పుడు దిగుబడిలో స్థిరత్వం ఉంటుంది. వ్యవసాయానికి వ్యవసాయ భూమి వినియోగం తక్కువగా ఉంటుంది. నిజానికి వాతావరణ మార్పులకు గ్రీన్‌హౌస్ వాయువు అత్యంత బాధ్యత వహిస్తుంది. ఆహార ఉత్పత్తులు సాగు, కోత, నిల్వ, రవాణా మొదలైన వాటిలో ఉత్పత్తి ప్రక్రియ ద్వారా వెళ్ళాలి. ఆహార వ్యర్థాలను అరికట్టకపోతే ఉత్పత్తి వ్యవస్థ మారదు. ఇది జరగకపోతే.. వాతావరణ మార్పులు కొనసాగుతాయి, ఇది రాబోయే కాలంలో మరింత భయంకరంగా మారుతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..