AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kashmiri Pandits: పూరన్ భట్ హత్యతో మళ్ళీ కాశ్మీరీ పండిట్‌ల్లో మొదలైన భయం.. ప్రభుత్వం సహాయం కోసం అర్ధింపు

జమ్మూ కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో కాశ్మీరీ పండిట్ పురాన్ కృష్ణ భట్ హత్య తర్వాత, లోయలో నివసిస్తున్న మైనారిటీ వర్గాల్లో భయం నెలకొంది. ఉగ్రవాదుల తదుపరి లక్ష్యం తామే కావచ్చునని ప్రజలు భయపడుతున్నారు. శనివారం షోపియాన్‌లో భట్‌ను ఉగ్రవాదులు కాల్చిచంపారు. ఈ ఘటన తర్వాత కాశ్మీరీ పండిట్లలో ఆందోళన వాతావరణం నెలకొంది . శ్రీనగర్‌లో నివసిస్తున్న ఈ కమ్యూనిటీ ప్రజలు ఈరోజు ఇంద్ర నగర్‌లోని శివాలయంలో భట్‌కు నివాళులర్పించారు. ఈ సంతాప సభలో పరిపాలన అధికారులు కూడా […]

Kashmiri Pandits: పూరన్ భట్ హత్యతో మళ్ళీ కాశ్మీరీ పండిట్‌ల్లో మొదలైన భయం.. ప్రభుత్వం సహాయం కోసం అర్ధింపు
Kashmiri Pandits
Surya Kala
|

Updated on: Oct 16, 2022 | 5:00 PM

Share

జమ్మూ కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో కాశ్మీరీ పండిట్ పురాన్ కృష్ణ భట్ హత్య తర్వాత, లోయలో నివసిస్తున్న మైనారిటీ వర్గాల్లో భయం నెలకొంది. ఉగ్రవాదుల తదుపరి లక్ష్యం తామే కావచ్చునని ప్రజలు భయపడుతున్నారు. శనివారం షోపియాన్‌లో భట్‌ను ఉగ్రవాదులు కాల్చిచంపారు. ఈ ఘటన తర్వాత కాశ్మీరీ పండిట్లలో ఆందోళన వాతావరణం నెలకొంది . శ్రీనగర్‌లో నివసిస్తున్న ఈ కమ్యూనిటీ ప్రజలు ఈరోజు ఇంద్ర నగర్‌లోని శివాలయంలో భట్‌కు నివాళులర్పించారు. ఈ సంతాప సభలో పరిపాలన అధికారులు కూడా పాల్గొన్నారు.

పూరన్‌కు నివాళులర్పించిన తర్వాత, కాశ్మీరీ పండిట్లు డివిజనల్ కమిషనర్‌ను, ఆపై డిసి శ్రీనగర్‌ను కలుసుకుని తమ సమస్యలను ఆయనకు తెలియజేశారు. కాశ్మీరీ పండిట్‌లు ఆన్‌లైన్‌లో పనిచేసే సౌకర్యాన్ని కల్పిస్తే, వారు ఎక్కడి నుండైనా పని చేయవచ్చని చెప్పారు. ఇది 24 గంటలు పని చేస్తూనే ఉంటుంది. ప్రజల ప్రాణాలకు రక్షణకల్పిస్తుందని పేర్కొన్నారు. భట్ బంధువు మాట్లాడుతూ, భట్ కుటుంబం షోపియాన్‌లో నివసిస్తుందని.. అయితే కరోనా మహమ్మారి వ్యాప్తి చెందిన తర్వాత.. భట్ తన భార్య, కొడుకు కుమార్తెతో కలిసి జమ్మూలో ఉండేలా ఏర్పాటు చేశాడు. కొడుకు V తరగతి చదువుతున్నాడు.. కుమార్తె VII లో చదువుతోంది.

హత్యకు KFF బాధ్యత వహించింది పురాణ్ కృష్ణ భట్ తరచుగా షోపియాన్‌లోని తన సోదరుడి యాపిల్ తోటను సందర్శించేవాడని.. అయితే తనకు ఎప్పుడూ ఎలాంటి సమస్య రాలేదన్నారు. ఈ దాడికి ఉగ్రవాద సంస్థ ‘కశ్మీర్ ఫ్రీడమ్ ఫైటర్’ (కేఎఫ్ఎఫ్) బాధ్యత వహించినట్లు డీఐజీ సుజిత్ కుమార్ శనివారం తెలిపారు. కశ్మీరీ పండిట్లపై పెరుగుతున్న ఉగ్రవాద దాడులపై పలువురు నేతలు బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు ఆరోపనలు చేశారు. సమాజానికి భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు.

లోయలో నివసిస్తున్న కాశ్మీరీ పండిట్లకు భద్రత కల్పించడంలో బీజేపీ విఫలమైందని, ఓట్ల కోసం వారి రక్తాన్ని అమ్ముకుంటుందని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీ అన్నారు. కాశ్మీరీ పండిట్లు కాశ్మీర్‌ను విడిచిపెట్టవద్దని ముస్లింలతో కలిసి ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారని మెహబూబా చెప్పారు. లోయలో ఉగ్రదాడులు ప్రారంభమైన 30-35 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ పండిట్ పై దాడి చేశారు. దీంతో భద్రత చాలా కట్టుదిట్టం చేశారు.

‘హోం మంత్రిత్వ శాఖ  వైఫల్యం’ కేంద్ర పాలిత ప్రాంతంలో శాంతిభద్రతల బాధ్యత కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఉంటుందని.. అయితే ఇప్పుడు జరిగిన హత్య కేంద్ర మంత్రిత్వ శాఖ వైఫల్యమని జమ్మూ కాశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ చీఫ్ రాంబన్ భల్లా అన్నారు. శనివారం భల్లా అధ్యక్షతన పార్టీ సీనియర్ నేతల సమావేశం జరిగింది. కాశ్మీర్‌లోని అమాయకుల ప్రాణాలను కాపాడేందుకు తక్షణమే సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి నవాబ్ నాసిర్ ఒక ప్రకటనలో, “కశ్మీర్‌లో రక్తపాతం నిరాటంకంగా కొనసాగుతోంది..  బిజెపి ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ పరిపాలన పరిస్థితి సాధారణంగా ఉందని పేర్కొందంటూ విమర్శించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..