Watch Video: నువ్వేంట్రా నాయనా మరీ ఇలా ఉన్నావ్.. రైల్వే ప్లాట్‌ఫాం మీదకు ఆటో.. అసలు విషయం తెలిసి..
రోడ్డుపై ఉండాల్సిన ఆటో.. ఏకంగా రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాం మీదకు వచ్చేసింది.. ఇదేంటి అని ప్రయాణికులంతా ఆశ్చర్యపోయారు..
రోడ్డుపై ఉండాల్సిన ఆటో.. ఏకంగా రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాం మీదకు వచ్చేసింది.. ఇదేంటి అని ప్రయాణికులంతా ఆశ్చర్యపోయారు.. రైల్వే ప్రొటెక్షన్ పోలీసులు కూడా.. సందేహపడ్డారు. తీరా.. అసలు విషయం తెలిసి నోరెళ్లబెట్టారు. ఓ ఆటో డ్రైవర్ ప్రయాణికులను ఎక్కించుకునేందుకు.. ఏకంగా ప్లాట్‌ఫాం మీదకు ఆటోను తీసుకుని వచ్చాడు. ఈ షాకింగ్ ఘటన ముంబైలో బిజీగా ఉండే కుర్లా రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అయితే, ప్లాట్‌ఫాం మీదకు ఆటోను తీసుకొచ్చిన డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నామని.. నెటిజన్ల విమర్శలకు ముంబై పోలీసులు సమాధానం చెప్పారు. కస్టమర్ల కోసం వెతికే ప్రయత్నం చేస్తుండగా ఆర్‌పీఎఫ్ పోలీసులు అడ్డుకున్నారని.. ఆటోను ప్లాట్‌ఫాం మీద నుంచి బయటకు తీసుకెళ్లారని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన ఆటో డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి.. ఆటోను సీజ్ చేశారని బదులిచ్చారు.
కుర్లా రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌లోకి ఆటో-రిక్షా ప్రవేశించిన వీడియో వైరల్‌గా మారడంతో.. అధికారుల తీరును ప్రశ్నిస్తూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. చాలా మంది సోషల్ మీడియా యూజర్లు కూడా పోలీస్ ఫోర్స్‌ను ట్యాగ్ చేసి ప్రశ్నిస్తుండటంతో.. అధికారులు చర్యలు తీసుకున్నామంటూ సమాధానం చేశారు. రైల్వే చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి.. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి జైలుగు తరలించినట్లు వెల్లడించారు.
వీడియో చూడండి..
When trains are late, we will get auto service directly on railway platforms.. Kurla station..
Credit goes to mumbai traffic police department.. pic.twitter.com/FbyoiPWoRt
— Thunder On Road (@thunderonroad) October 15, 2022
కుర్లా ఆర్‌పిఎఫ్ సమాచారం ప్రకారం.. అక్టోబర్ 12వ తేదీ మధ్యాహ్నం 1:00 గంటల సమయంలో రైలు వస్తుండగా.. ఆటో కుర్లా ప్లాట్‌ఫాం నెం.1లోకి ప్రవేశించింది. ప్రయాణికుల కోసం.. డ్రైవర్ ఎదురుచూస్తుండటంతో అవాక్కయిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..