Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Protein Side Effects: మంచిదని ప్రొటీన్ ఆహారం ఎక్కువగా తీసుకుంటున్నారా..? ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త..!

ప్రొటీన్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. శరీరానికి సరైన మోతాదులో ప్రొటీన్ అందకపోతే అనేక అనారోగ్యసమస్యలు తలెత్తుతాయి. బరువు అదుపులో ఉండాలంటే ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం మంచిది.

Protein Side Effects: మంచిదని ప్రొటీన్ ఆహారం ఎక్కువగా తీసుకుంటున్నారా..? ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త..!
Protein Deficiency
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 16, 2022 | 3:39 PM

ప్రొటీన్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. శరీరానికి సరైన మోతాదులో ప్రొటీన్ అందకపోతే అనేక అనారోగ్యసమస్యలు తలెత్తుతాయి. బరువు అదుపులో ఉండాలంటే ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం మంచిది. చాలా మంది బరువు తగ్గాలనే ఆతురుతలో ఎక్కువ మోతాదులో ప్రొటీన్ తీసుకోవడం మొదలుపెడతారు. కానీ ఎక్కువ మోతాదులో ప్రొటీన్ తీసుకోవడం ఆరోగ్యానికి కూడా హాని కలిగిస్తుంది. శరీరంలో ప్రొటీన్లు అధికంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

అధిక ప్రోటీన్ ఆహారం మంచిదే.. కానీ..

ప్రస్తుతం ఫిట్‌నెస్‌పై విపరీతమైన క్రేజ్ నెలకొంది. మంచి శరీరం కోసం ప్రజలు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు జిమ్‌లో చెమటోడ్చుతారు.. మరికొందరు డైట్ చేస్తారు. శరీర నిర్మాణానికి చాలా మంది ప్రొటీన్లు ఎక్కువ తీసుకుంటారు. ప్రోటీన్ ఆరోగ్యానికి ప్రయోజనకరంగా పరిగణిస్తారు. ప్రొటీన్లు ఎక్కువగా ఉండటం వల్ల ఆకలి తగ్గుతుంది. ఈ విధంగా, ప్రోటీన్-రిచ్ డైట్ బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

ఎంత ప్రోటీన్ తీసుకోవాలి?

డైటీషియన్ల ప్రకారం.. సాధారణంగా మీ బరువుకు అనుగుణంగా ప్రొటీన్లు తీసుకోవాలని సూచిస్తున్నారు. అంటే, మీ బరువు 50 కిలోలు ఉంటే అప్పుడు 24 గంటల్లో మీరు 50 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి. బరువు అదుపులో ఉండాలంటే ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. అలాంటి వారు తీసుకునే దాని కంటే ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటారు.

  1. ఊబకాయం సమస్య: ప్రోటీన్ బరువును తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. కానీ చాలా ప్రోటీన్ తీసుకుంటే.. బరువు పెరుగుటకు దారితీస్తుంది. ప్రొటీన్ శరీరంలోని అనేక భాగాల్లో కొవ్వును పెంచుతుంది. కాబట్టి ప్రొటీన్లు ఎక్కువగా తీసుకోకూడదు.
  2. జీర్ణ సమస్యలు: అధిక మొత్తంలో ప్రోటీన్ తీసుకోవడం వల్ల జీర్ణక్రియలో సమస్యలను కలిగిస్తుంది. ప్రొటీన్‌లు ఎక్కువగా ఉండటం వల్ల చాలా మందికి మలబద్ధకం సమస్య మొదలవుతుంది. ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం సులభంగా జీర్ణం కావడం కష్టం.
  3. మూత్రపిండాలకు నష్టం: ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం కిడ్నీలకు హాని కలిగిస్తుంది. అధిక ప్రోటీన్ ఆహారం కారణంగా, మూత్రపిండాలలో పెద్ద మొత్తంలో నత్రజని ఏర్పడుతుంది. కిడ్నీ సమస్యలు ఉన్నవారు లేదా.. సాధారణంగా ఈ నైట్రోజన్‌ను తొలగించేందుకు కిడ్నీలు ఎక్కువగా పని చేయాల్సి ఉంటుంది. దీనివల్ల కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఇబ్బందులు పడతారు.
  4. బలహీనమైన ఎముకలు: అధిక ప్రోటీన్ వల్ల ఎముకలు బలహీనపడతాయి. ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం బోలు ఎముకల వ్యాధికి దారి తీస్తుంది. కాల్షియం లోపిస్తే ఎముకల నొప్పి వస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..