Breathing Rate: శ్వాస రేటు అంటే ఏమిటి..? ఏ వయసు వారు ఎంత శ్వాస తీసుకుంటారో తెలుసా..?

కరోనా కాలం నుంచి చాలా మందికి అనారోగ్య సమస్యలు పెరిగిపోయాయి. రకరకాల వైరస్‌లు దాడులు చేయడంతో వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. కరోనా వచ్చి కోలుకున్న..

Breathing Rate: శ్వాస రేటు అంటే ఏమిటి..? ఏ వయసు వారు ఎంత  శ్వాస తీసుకుంటారో తెలుసా..?
Breathing
Follow us
Subhash Goud

|

Updated on: Oct 16, 2022 | 2:44 PM

కరోనా కాలం నుంచి చాలా మందికి అనారోగ్య సమస్యలు పెరిగిపోయాయి. రకరకాల వైరస్‌లు దాడులు చేయడంతో వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. కరోనా వచ్చి కోలుకున్న వారు ఎన్నో అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. అందుకే ఆరోగ్యంపై ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యమంటున్నారు వైద్య నిపుణులు. గత మూడేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించింది. కరోనా కాటుకు ఎంతో మంది బలయ్యారు. చాలామందికి వైరస్‌లు శ్వాసకోశ వ్యవస్థపై దాడులు చేస్తుంటాయి. కరోనా సమయంలో శ్వాస తీసుకోవడంలో చాలా మంది ఇబ్బంది పడ్డారు. అయితే ప్రస్తుతం మానవుని శ్వాస రేటు గురించి తెలుసుకుందాం.

  1. శ్వాస రేటు అంటే ఏమిటి..?: శ్వాస రేటు అంటే మీరు నిమిషంలో ఎన్నిసార్లు శ్వాస తీసుకుంటున్నారో అని అర్థం. ముఖ్యంగా శ్వాస రేటు అనేది మన శరీరంపై ప్రముఖ పాత్ర ప పోషిస్తుంటుంది. శ్వాస రేటు తగ్గితే అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు పదేపదే చెబుతుంటారు. శ్వాసకోశ రేటు తెలుసుకోవడం వల్ల అనేక రకాల వ్యాధులను గుర్తించవచ్చు. అయితే చిన్న పిల్లలు, వయోజనుల శ్వాస రేటులో చాలా తేడా ఉంటుంది.
  2. వయోజనుల సాధారణ శ్వాసరేటు ఎలా ఉండాలి: హెల్త్‌లైన్‌ నివేదిక ప్రకారం.. పెద్దవారి సాధారణ శ్వాసరేటు నిమిషానికి 12 నుంచి 16 వరకు ఉంటుంది. అంటే ఆరోగ్యవంతులైన వయోజనుడు నిమిషంలో 12 నుంచి 16 సార్లు శ్వాస తీసుకుంటాడు. మీ శ్వాస రేటు 12 కన్నా తక్కువ లేదా 16 కంటే ఎక్కువ ఉంటే మీరు వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. కానీ మీ శ్వాస రేటులో వ్యత్యాసం ఉంటే తప్పకుండా వైద్యున్ని సంప్రదించాల్సి ఉంటుంది. మీ నాడీ వ్యవస్థలో జరిగే సమస్యలకు సాధారణ శ్వాసరేటు కంటే తక్కువ కారణం కావచ్చు. ఇది కాకుండా పెరుగుతున్న వయసుతో మన శ్వాస రేటు కూడా మారుతూ ఉంటుంది.
  3. నవజాత శిశువు శ్వాస రేటు: వయోజనుడితో పోలిస్తే చిన్న పిల్లల శ్వాస రేటులో చాలా తేడా ఉంటుంది. పిల్లల శ్వాస రేటు ఎంత ఉంటుందో తెలిస్తే ఆశ్యర్యపోతారు. అప్పుడే పుట్టిన శిశువు నిమిషానికి 30 నుంచి 60 సార్లు శ్వాస తీసుకుంటుంది. ఈ శ్వాస రేటు పుట్టినప్పటి నుంచి ఒక సంవత్సరం వరకు ఉంటుంది. 1 నుంచి 3 సంవత్సరాల పిల్లలు ఒక నిమిషంలో 24 నుంచి 34 సార్లు శ్వాస తీసుకుంటారు. 6 నుంచి 12 సంవత్సరాల పిల్లలు శ్వాస రేటు 18 నుంచి30 మధ్య ఉంటుంది. అలాగే 12 నుంచి 18 సంవత్సరాలున్న పిల్లలు నిమిషంలో 12 నుంచి 16 సార్లు శ్వాస తీసుకుంటారు. పెద్దవారి శ్వాస రేటు కూడా సమానంగా ఉంటుంది. వయసు పెరుగుతున్నకొద్ది ఇది మారుతూ ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి