Hair Care: సడన్‌గా జట్టు రాలుతోందా.. మీరు తీసుకునే ఫుడ్‌లో ఈ విటమిన్ లోపం ఉండొచ్చు..

జుట్టు సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. కానీ కొన్నిసార్లు విటమిన్లు లేకపోవడం వల్ల జుట్టులో చుండ్రు వస్తుంది. ఏ విటమిన్ లోపం వల్ల ఈ సమస్య వస్తుందో తెలుసుకుందాం.

Hair Care: సడన్‌గా జట్టు రాలుతోందా.. మీరు తీసుకునే ఫుడ్‌లో ఈ విటమిన్ లోపం ఉండొచ్చు..
Hair care
Follow us

|

Updated on: Oct 16, 2022 | 6:49 PM

శరీరంలో పోషకాల కొరత ఏర్పడినప్పుడు.. దాని ప్రభావం ఆరోగ్యం, చర్మం, జుట్టు మీద కనిపిస్తుంది. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే, వాటి సంరక్షణతో పాటు శరీరంలో సరైన పోషకాలు ఉండటం కూడా చాలా ముఖ్యం. ఇక్కడ మనం ముందుగా చుండ్రు గురించి మాట్లాడుకుందాం. ఇది జుట్టు రాలడానికి కారణం కావచ్చు. అలాగే ఇది పొడిగా, నిర్జీవంగా మారుతుంది. ధూళి, తేమ, చెమట, దుమ్ము లేదా బలమైన సూర్యకాంతి చుండ్రుకు ముఖ్య కారణం కావచ్చు. అయితే కొన్ని విటమిన్ల లోపం వల్ల కూడా చుండ్రు వస్తుంది. ఏ విటమిన్ లోపం వల్ల చుండ్రు సమస్య వస్తుందో ఇక్కడ మనం తెలుసుకుందాం..

బయోటిన్ లేదా విటమిన్ B7

విటమిన్ B7 ను బయోటిన్ అని కూడా పిలుస్తారు. జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. బయోటిన్ ప్రత్యేకత ఏమిటంటే ఇది ఆరోగ్యానికి ముఖ్యమైన ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. ఈ విటమిన్ లోపం రక్త ప్రసరణ, జుట్టు రాలడాన్ని ప్రభావితం చేస్తుంది. దాని లోపాన్ని అధిగమించడానికి, బాదం, మాంసం, చేపలు, తృణధాన్యాలు తినండి.

విటమిన్ సి లోపం

చర్మంలో మెరుపు, మంచి జుట్టు పెరుగుదలకు కొల్లాజెన్ అవసరం. విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. శరీరంలో విటమిన్ సి లోపం ఉంటే జుట్టు రాలడం, చుండ్రు, జుట్టు పల్చబడడం వంటి సమస్యలు వస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. విటమిన్ సి లోపం సెబోరోహెయిక్ డెర్మటైటిస్‌కు దారితీస్తుంది. తద్వారా చుండ్రు పెరుగుతుంది. శరీరానికి విటమిన్ సి అందాలంటే సిట్రస్ పండ్లను తీసుకోవాలి.

విటమిన్ డి లోపం

విటమిన్ డి కూడా ఒక ముఖ్యమైన విటమిన్, దీని లోపం ఎముకలను మాత్రమే కాకుండా జుట్టును కూడా బలహీనపరుస్తుంది. విటమిన్ డి లోపం బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ లక్షణం. మనం సూర్యకాంతి సరిగ్గా అందనప్పుడు.. ఒక్కోసారి సూర్యకాంతి దొరికినా అందులో నుంచి వచ్చే డీ విటమిన్‌ను శరీరం తీసుకోకపోవచ్చు. ఇలాంటి సమయంలో కాడ్ లివర్ ఆయిల్, మష్రూమ్ లేదా ఫ్యాటీ ఫిష్ కూడా శరీరంలో విటమిన్ డి లోపాన్ని తొలగిస్తుంది. మీ జుట్టు సంరక్షణతో పాటు, మీరు మీ సాధారణ జీవితంలో కూడా మార్పులు చేసుకోవాలి. జుట్టు సమస్యలకు కారణమయ్యే ఒత్తిడిని తగ్గించుకోవాలి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం..

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!