AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WINTER SKIN CARE: చర్మం పొడిబారుతోందా?.. ఇలా చేస్తే రోజంతా మెరిసిపోవచ్చు..

చలికాలం మొదలవుతుంది. వాతావరణంలో వచ్చే మార్చులు మన ఆరోగ్యంపై.. ముఖ్యంగా మన చర్మంపై కూడా కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో మనం మన చర్మంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.

WINTER SKIN CARE: చర్మం పొడిబారుతోందా?.. ఇలా చేస్తే రోజంతా మెరిసిపోవచ్చు..
Skin Care
Sanjay Kasula
|

Updated on: Oct 16, 2022 | 7:08 PM

Share

వాతావరణం వేగంగా మారుతోంది. వెచ్చని గాలులకు బదులుగా చల్లటి గాలులు వీస్తున్నాయి. మారుతున్న వాతావరణం ప్రభావం ఆరోగ్యంపైనే కాకుండా చర్మంపైనా కనిపిస్తుంది. చల్లటి గాలులతో చర్మం పొడిబారడం, నిర్జీవంగా మారడం వల్ల చర్మం చాలా డ్రైగా కనిపిస్తుంది. చర్మం పొడిబారడం వల్ల చర్మంపై దురద చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కొన్నిసార్లు చర్మం పొడిబారడం వల్ల పొరలుగా మారుతుంది. పెదవుల చుట్టూ, బుగ్గలపై, నుదుటిపై ఈ డ్రై స్కిన్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో చర్మంపై మాయిశ్చరైజర్ సరిపోదు. మారుతున్న సీజన్లలో మీ చర్మానికి అదనపు సంరక్షణ అవసరం. ఈ సీజన్‌లో చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచేందుకు ఆహారాన్ని మార్చుకోవాలి. ఎక్కువ నీరు తాగడం వల్ల చర్మం హైడ్రేట్ గా ఉంటుంది. చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి హోం రెమెడీస్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. మారుతున్న సీజన్‌లో చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి ఏ చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం.

కొబ్బరి నూనెతో మసాజ్:

ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న కొబ్బరి నూనెలో ఎమోలియెంట్లు ఉంటాయి. ఇది జిగటగా ఉంటుంది. కొబ్బరిలో కొవ్వు ఉంటుంది. ఇది చర్మాన్ని మృదువుగా చేస్తుంది. చర్మం పొడిబారడాన్ని తొలగించడంలో కొబ్బరి నూనె చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. కొబ్బరి నూనెలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ చర్మాన్ని మృదువుగా మార్చడంలో సహాయపడతాయి.

తేనెతో డ్రై స్కిన్‌ తొలగించండి:

ఆరోగ్యంతో పాటు చర్మ సమస్యలను దూరం చేయడంలో తేనె ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇది చర్మంపై మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. దీన్ని చర్మంపై ఉపయోగించడం వల్ల చర్మానికి పోషణ అందుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. 10 నిమిషాల పాటు తేనెతో చర్మాన్ని మసాజ్ చేయడం వల్ల చర్మం తేమగా ఉంటుంది.

పెట్రోలియం జెల్లీతో మసాజ్ చేయండి:

పెట్రోలియం జెల్లీ చర్మంపై ఔషధంలా పనిచేస్తుంది. పొడి చర్మాన్ని వదిలించుకోవడానికి పెట్రోలియం జెల్లీ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. పెట్రోలియం జెల్లీ చర్మంపై రక్షణ కవచంగా పనిచేస్తుంది. దీన్ని చర్మంపై ఉపయోగించడం వల్ల చర్మం పొడిబారకుండా కాపాడుతుంది. ఇది స్కిన్ ఇరిటేషన్ తగ్గించి చర్మాన్ని ఆరోగ్యవంతంగా మార్చుతుంది.

బాదం నూనెతో మసాజ్ చేయండి:

బాదం నూనె చర్మంపై టానిక్‌గా పనిచేస్తుంది. చర్మ సంరక్షణకు ఉపయోగపడే ఈ నూనెలో విటమిన్-ఇ ఉంటుంది. ఈ ఆయిల్ చర్మాన్ని రిపేర్ చేస్తుంది. అలాగే చర్మానికి మెరుపును తెస్తుంది. ఈ నూనెతో చర్మాన్ని ఐదు నిమిషాల పాటు మసాజ్ చేయడం మంచిది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం..

Follow Us
IPL 2027: ధోనీతో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లకు చెన్నై గుడ్ బై..?
IPL 2027: ధోనీతో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లకు చెన్నై గుడ్ బై..?
ముంచుకొస్తున్న నైరుతి రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు..
ముంచుకొస్తున్న నైరుతి రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు..
ఒంటికి చలువ చేసే అదిరిపోయే ఈవెనింగ్ స్నాక్స్.. తోటకూర పకోడీ..
ఒంటికి చలువ చేసే అదిరిపోయే ఈవెనింగ్ స్నాక్స్.. తోటకూర పకోడీ..
మీకో సవాల్.. ఈ చిత్రంలో ఉన్న నెంబర్‌ను కనిపెడితే.. మీరే తోపులు!
మీకో సవాల్.. ఈ చిత్రంలో ఉన్న నెంబర్‌ను కనిపెడితే.. మీరే తోపులు!
బట్టల మురికి వదలట్లేదా?.. వాషింగ్ మెషీన్‌లో ఇదొక్కటి కలపండి!
బట్టల మురికి వదలట్లేదా?.. వాషింగ్ మెషీన్‌లో ఇదొక్కటి కలపండి!
మీ కెరీర్‌లో గ్రోత్ లేదా?.. మీరు చేసే ఈ చిన్న తప్పే కారణం
మీ కెరీర్‌లో గ్రోత్ లేదా?.. మీరు చేసే ఈ చిన్న తప్పే కారణం
పూజ చేస్తూ మనసు ఇతర విషయాలపైకి వెళ్తే అది పాపమా? ప్రేమానంద్ జీ...
పూజ చేస్తూ మనసు ఇతర విషయాలపైకి వెళ్తే అది పాపమా? ప్రేమానంద్ జీ...
ఒక్క మ్యాచ్ ఆడకుండా ధోనీ ఎంత జీతం తీసుకున్నాడో తెలుసా..?
ఒక్క మ్యాచ్ ఆడకుండా ధోనీ ఎంత జీతం తీసుకున్నాడో తెలుసా..?
కుళాయి నీరు కారుతున్నాయా? మీ ఇంట్లో డబ్బు ఖాళీ అవ్వడం పక్కా
కుళాయి నీరు కారుతున్నాయా? మీ ఇంట్లో డబ్బు ఖాళీ అవ్వడం పక్కా
బ్యాంకులు వరుసగా ఆరు రోజులు బంద్
బ్యాంకులు వరుసగా ఆరు రోజులు బంద్