AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Child Health: పిల్లలను ఒంటరిగా వదిలేస్తున్నారా.. వారి కదలికలపై ఓ కన్నేసి ఉంచండి..

పిల్లలు ఉన్న ఇల్లు ఎప్పుడూ సందడిగానే ఉంటుంది. చిన్నారులు ఉంటే ఆ ఆనందమే వేరు. కానీ తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగులు అయితే వారి సంరక్షణ చూసుకునే బాధ్యత పెను సమస్యగా మారుతుంది. అలాంటి..

Child Health: పిల్లలను ఒంటరిగా వదిలేస్తున్నారా.. వారి కదలికలపై ఓ కన్నేసి ఉంచండి..
Follow us
Ganesh Mudavath

|

Updated on: Oct 16, 2022 | 6:53 AM

పిల్లలు ఉన్న ఇల్లు ఎప్పుడూ సందడిగానే ఉంటుంది. చిన్నారులు ఉంటే ఆ ఆనందమే వేరు. కానీ తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగులు అయితే వారి సంరక్షణ చూసుకునే బాధ్యత పెను సమస్యగా మారుతుంది. అలాంటి పరిస్థితుల్లో వారి బంధువులో, చైల్డ్ కేర్ సెంటర్లలో వదిలేస్తూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో పిల్లలు కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందుకే వారంతట వారే ఇంట్లో ఉండేలా సంసిద్ధులను చేయాలి. పని కోసం, ఎమర్జెన్సీ కోసం తల్లి దండ్రులిద్దరూ పిల్లలను ఇంట్లో ఒంటరిగా వదిలి వెళ్లే సందర్భాలు వస్తుంటాయి. అలాంటి సందర్భాల్లో చిన్నారులకు కొన్ని విషయాలను తప్పక చెప్పాలి. పిల్లలను ఇంట్లో ఒంటరిగా వదిలి వెళితే వారి ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఫలితంగా స్ట్రాంగ్‌గా అవుతారు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. ఈ రోజుల్లో పిల్లలు కూడా స్మార్ట్ ఫోన్స్ ను ఉపయోగిస్తున్నారు. అందుకే వారికి కచ్చితంగా రెండు, మూడు ఎమర్జెన్సీ నంబర్‌లను నేర్పించాలి. తల్లిదండ్రల నంబర్‌, దగ్గరి బంధువులు, పొరుగువారి ఫోన్‌ నంబర్‌ నేర్పిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. నంబర్‌‌ మర్చిపోకుండా ఓ నోట్‌బుక్‌లో రాసివ్వండి. ఇంటి నుండి బయటకు వచ్చిన తర్వాత, పిల్లలు ఎలా ఉన్నారో తెలుసుకునేందుకు తరచుగా ఫోన్ కాల్స్ చేస్తూ ఉండాలి.

ఇంట్లో ఎవరూ లేకుంటే వారు టీవీలు ఎక్కువగా చూసే అవకాశం ఉంది. దీని వల్ల ఎన్ని సమస్యలు వస్తాయో మనకు తెలిసిందే. అందుకే స్క్రీన్‌ టైమ్‌ గురించి వారికి కచ్చితంగా చెప్పండి. ఈ విషయంలో కాస్త కఠినంగానే ఉండాలి. గ్యాస్‌ స్టవ్ స్విచ్ ను ఆఫ్ చేసి వెళ్లాలి. కత్తులు, కత్తెరలు, స్క్రూడ్రైవర్లు వంటి పదునైన వస్తువులను దగ్గరకు వెళ్లవద్దని చెప్పి, వాటి వల్ల కలిగే నష్టాల గురించి వివరించాలి.

వారికి ఆకలేస్తే తినేందుకు స్నాక్స్ అందుబాటులో ఉంచటాలి. పిల్లలు మందులు వేసుకోవాల్సి ఉంటే ఆ మందులు ఒక దగ్గర పెట్టాలి. వేరే మందులు వేసుకోకుండా జాగ్రత్త వహించాలి. తలుపులు వేసుకోవాలని, బయటకు రాకూడదని వివరించాలి. వీలైతే ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.