Kidney Health: కాళ్లలో వాపు ఇబ్బంది పడుతుందా.. నిర్లక్ష్యం వహిస్తే కిడ్నీ సమస్యలకు దారి తీయవచ్చు.. బీ అలర్ట్..

మారిపోతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు కారణంగా కిడ్నీ వ్యాధి కేసులు ఏటా పెరిగి పోతున్నాయి. మన శరీరంలో కిడ్నీ చాలా ముఖ్యమైన భాగం. శరీరంలో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలను తొలగించడంలో..

Kidney Health: కాళ్లలో వాపు ఇబ్బంది పడుతుందా.. నిర్లక్ష్యం వహిస్తే కిడ్నీ సమస్యలకు దారి తీయవచ్చు.. బీ అలర్ట్..
Kidney Health
Follow us
Ganesh Mudavath

|

Updated on: Oct 16, 2022 | 6:29 AM

మారిపోతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు కారణంగా కిడ్నీ వ్యాధి కేసులు ఏటా పెరిగి పోతున్నాయి. మన శరీరంలో కిడ్నీ చాలా ముఖ్యమైన భాగం. శరీరంలో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలను తొలగించడంలో కిడ్నీలు ఉపయోగపడతాయి. అంతే కాకుండా శరీరంలోని పొటాషియం లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచుతుంది. అయితే కిడ్నీకి సంబంధించిన సమస్య ఏర్పడితే దానిని తేలికగా తీసుకోకూడదు. కానీ చాలా మంది దీనిని అంతగా పట్టించుకోరు. ఇలా చేయడం వల్ల సమస్య తీవ్రతరమవుతుంది. మూత్రపిండ వ్యాధులను మూత్రం ద్వారా సులభంగా గుర్తించవచ్చని వైద్యులు చెబుతున్నారు. యూరిన్ చేసేటప్పుడు మంటగా అనిపించడం, మూత్రంలో రక్తం రావడం, మూత్రం రంగులో మార్పు కనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే అవి కిడ్నీకి సంబంధించిన వ్యాధి లక్షణాలుగా గుర్తించాలి. దీనిని నిర్లక్ష్యం వహిస్తే కిడ్నీ ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు. అటువంటి పరిస్థితిలో, వెంటనే వైద్యుల సలహా తీసుకోవాలి. ఎందుకంటే కిడ్నీ ఇన్‌ఫెక్షన్‌కు సకాలంలో చికిత్స అందకపోతే, అది చాలా అవయవాలకు వ్యాపిస్తుంది.

కొన్నిసార్లు కిడ్నీలో తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకుతుంది. మూత్రంలో ఉండే ప్రమాదకరమైన బ్యాక్టీరియా మూత్ర నాళం ద్వారా కిడ్నీకి చేరి, కిడ్నీ ఇన్‌ఫెక్షన్‌కు కారణమవుతుంది. ఇది కాకుండా, పాదాలలో వాపు కూడా మూత్రపిండాల వ్యాధి లక్షణం. పాదాలలో వాపు ఎక్కువ రోజులు తగ్గకుండా అలాగే కంటిన్యూ అయితే వైద్యుడిని సంప్రదించడం అవసరం. మీకు డయాబెటిస్ లేదా గుండె సమస్యలు ఉంటే, మూత్రపిండాల వ్యాధులపై శ్రద్ధ వహించాలి. అలాంటి వారిలో కిడ్నీ ఫెయిల్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

కిడ్నీ ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంపై శ్రద్ధ పెట్టాలి. వైద్యుల సలహా లేకుండా ఏ వ్యాధికి మందులు వాడవద్దు. ఎందుకంటే మందులు ఎక్కువగా వాడటం వల్ల కిడ్నీలు కూడా ప్రభావితమవుతాయి. రోజుకు కనీసం 4 లీటర్ల నీరు తాగాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ శరీరంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవాలి. కింది భాగంలో నొప్పి లేదా మూత్రానికి సంబంధించిన ఏవైనా లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.