Green Apple: అలాంటి సమస్యలున్న వారికి వరం గ్రీన్ యాపిల్.. ప్రయోజనాలు తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు..
గ్రీన్ యాపిల్‌లో కాల్షియం, ఐరన్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు వంటి లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరానికి మేలు చేయడంతోపాటు పలు వ్యాధులను దూరం చేస్తాయి.
యాపిల్‌లో ఎన్నో పోషకాలు, ప్రొటిన్లు దాగున్నాయి. అందుకే యాపిల్‌ను ఆరోగ్య నిధి కూడా అంటారు. రోజూ యాపిల్స్ తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. చాలా ప్రదేశాలలో రెడ్ యాపిల్ తినడం ఒక ట్రెండ్.. కానీ గ్రీన్ యాపిల్ కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. గ్రీన్ యాపిల్‌లో కాల్షియం, ఐరన్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు వంటి లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరానికి మేలు చేయడంతోపాటు పలు వ్యాధులను దూరం చేస్తాయి.
మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది..
క్వెర్సెటిన్ అనే మూలకం.. గ్రీన్ యాపిల్స్‌లో ఉంటుంది. గ్రీన్ కలర్ యాపిల్ మానసిక ఆరోగ్యాన్ని బలోపేతం చేయడానికి చాలా మంచిదని భావిస్తారు. అల్జీమర్స్ వ్యాధి ఉన్నవారు క్రమం తప్పకుండా గ్రీన్ యాపిల్స్ తీసుకోవాలి.
ఎముకలను దృఢంగా చేస్తాయి: గ్రీన్ యాపిల్స్ లో క్యాల్షియం మంచి మొత్తంలో ఉంటుంది. ఎముకల ఆరోగ్యానికి కాల్షియం అవసరం. వయసు దాటిన తర్వాత మహిళల్లో ఎముకలు బలహీనపడతాయి. అటువంటి పరిస్థితిలో మీరు ప్రతిరోజూ గ్రీన్ యాపిల్ తినవచ్చు.
కాలేయాన్ని బలోపేతం చేస్తాయి: గ్రీన్ యాపిల్స్‌లో ఉండే పోషకాలు కాలేయాన్ని బలోపేతం చేయడానికి పని చేస్తాయి. గ్రీన్ యాపిల్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు మేలు చేస్తాయి.
జీర్ణక్రియలో ప్రయోజనకరంగా ఉంటుంది: గ్రీన్ యాపిల్ జీర్ణక్రియకు చాలా మంచిదిగా పరిగణిస్తారు. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు చాలా మేలు చేస్తుంది. గ్రీన్ యాపిల్ తినడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది.
బరువు తగ్గవచ్చు: గ్రీన్ యాపిల్స్ లో ఖనిజాలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని తినడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది. గ్రీన్ యాపిల్ చాలా శక్తిని ఇస్తుంది. దీన్ని రోజూ తింటే బరువు తగ్గవచ్చు.
కంటి చూపును పెంచుతాయి: విటమిన్ ఎ గ్రీన్ యాపిల్ లో మంచి పరిమాణంలో ఉంటుంది. ఇది కళ్లకు మేలు చేస్తుంది. ఆపిల్ కంటి చూపును పెంచడంలో ప్రభావవంతంగా ఉంటుందని పేర్కొంటున్నారు.
ఊపిరితిత్తులకు మేలు చేస్తాయి: గ్రీన్ యాపిల్ ఊపిరితిత్తులకు కూడా మేలు చేస్తుంది. దీని వినియోగం ఊపిరితిత్తుల పని తీరును బలోపేతం చేసి.. శ్వాస సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..